
పెండింగ్ ఫీజు విడుదల చేయాలి
ిసరిసిల్లటౌన్: పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫీజులు విడుదల చేయాలని స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో శనివారం నిర్వహించిన ఫీజు దీక్షలో మాట్లాడారు. ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకునే విద్యార్థులకు ప్రైవేటు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని కోరారు. ఫీజుదీక్షలో సుమారుగా 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గాంతుల మహేశ్, ఎల్లారెడ్డి, కోడం రమణ, మల్లారపు అరుణ్‌కుమార్, ఎర్రవెల్లి నాగరాజు సంఘీభావం తెలిపారు.