
అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. వేములవాడలో రూ.6కోట్లతో చేపట్టే రోడ్డు విస్తరణ పనులకు ఆదివారం శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో శనివారం నిర్వహించిన కాంగ్రెస్ పట్టణ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన నిర్వాసితులను ఆదుకునేందుకు ఇప్పటికే నష్టపరిహారం చెల్లించినట్లు తెలిపారు. మూలవాగు, గుడిచెరువులో మురికినీరు కలవకుండా సుమారు రూ.9కోట్లతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు. వేములవాడను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామని, రాజన్న భక్తులకు వేములవాడ చేరుకోగానే ఆహ్లాదకర వాతావరణం కనిపించేలా అభివృద్ధి చేస్తామన్నారు. వేములవాడలో అడుగు స్థలం లేని సుమారు 144 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
మల్కపేట రిజర్వాయర్‌ను నింపాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మల్కపేట రిజర్వాయర్‌ను నింపి ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి మండలాలకు కాలువల ద్వారా సాగునీటిని అందించాలని మండల కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కోరారు. ఈ మేరకు శనివారం వినతిపత్రం అందించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, ఏఎంసీ వైస్‌చైర్మన్ గుండాడి రాంరెడ్డి, నాయకులు కల్లూరి బాపురెడ్డి తదితరులున్నారు.