
‘నీరు’గారుతోంది !
ఇది సిరిసిల్ల శివారులోని చంద్రంపేట వద్ద సిరిసిల్ల–కరీంనగర్ ప్రధాన రహదారి డివైడర్‌పైన ఉన్న డ్రిప్ పైపు పగిలిపోయి నీరు పైకి ఎగచిమ్ముతోంది. సిరిసిల్లలోని డివైడర్‌పైనున్న మొక్కలకు, చెట్లకు అందాల్సిన నీరు ఇలా వృథాగా పోతుంది. ఫలితంగా రోడ్డు చివరణ డివైడర్‌పైనున్న మొక్కలకు నీరు అందక ఎండిపోయే ప్రమాదం ఉంది.
ఇది సిరిసిల్ల పట్టణ శివారులోని జ్యోతినగర్ వద్ద సిరిసిల్ల–కరీంనగర్ ప్రధాన రహదారి. ఇక్కడ నివసించే స్థానికులు రోడ్డు డివైడర్‌పై ఉన్న వాటర్ డ్రిప్ పైపును కట్ చేసి నీళ్లు పట్టుకుంటున్నారు. మున్సిపల్ అధికారులు డివైడర్‌పై ఉన్న మొక్కలను నీరందించేందుకు మోటార్‌ను పెట్టి డ్రిప్ పైపు ద్వారా సరఫరా చేస్తే.. ఇలా మధ్యలోనే పక్కదారి పడుతున్నాయి. మిషన్ భగీరథ నల్లా పైపులు ఉన్నా ఇలా డ్రిప్ పైపు నీటిని పట్టుకుంటున్నారు.

‘నీరు’గారుతోంది !