
పాడిపరిశ్రమతో అదనపు ఆదాయం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ/చందుర్తి/కోనరావుపేట(వేములవాడ): రైతులు వ్యవసాయరంగానికి అనుబంధంగా పాడిపరిశ్రమను నెలకొల్పుకుంటే అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చందుర్తి మండలం సనుగుల, కోనరావుపేట మండలం ఎగ్లాస్‌పూర్ గ్రామాల్లోని లబ్ధిదారులకు పాడి గేదెలను శుక్రవారం అందజేశారు. విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతీ మండలంలోని ఒక్కో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి పాడిపరిశ్రమను అభివృద్ధి చేస్తామన్నారు. సనుగుల ఎర్ర, పటేల్ చెరువు, ఆశిరెడిపల్లె కొత్తచెరువులను ఎల్లంపల్లి నీటితో నింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. మండల ప్రత్యేకాధికారి, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి రవీందర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, చందుర్తి తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవోలు రాధ, శంకర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌లు చెలుకల తిరుపతి, కచ్చకాయల ఎల్లయ్య పాల్గొన్నారు.
ఆరోగ్యంపై దృష్టి సారించాలి
ఉరుకులు, పరుగుల జీవితంలో ప్రతీ ఒక్కరు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. వేములవాడ ప్రెస్‌క్లబ్, కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి సంయుక్తంగా శుక్రవారం నిర్వహించిన మెగా వైద్యశిబిరంలో పాల్గొన్నారు. గుండె వైద్యులు అనిష్ పబ్బ, జనరల్ ఫిజీషియన్ లోకేష్, ఆర్థోపెడిక్ సర్జన్ రాకేష్ వైద్యపరీక్షలు చేశారు. ఆస్పత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఎండీ రఫీక్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొలిపాక నర్సయ్య, సెక్రటరీ జితేందర్, ఉపాధ్యక్షులు సయ్యద్ అలీ, శ్రీనివాస్, మెడికవర్ మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, లక్ష్మీరాజం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.