
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్ల/ముస్తాబాద్(సిరిసిల్ల): మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆకాంక్షించారు. ముస్తాబాద్ ఐకేపీలోని శుభోదయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన యూరియా కేంద్రాన్ని ఏఎంసీ చైర్‌పర్సన్ తలారి రాణి ప్రారంభించారు. స్థానిక కస్తూర్భా విద్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఆవరణలో చెత్త, పిచ్చిమొక్కలను వెంటనే తొలగించాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆవునూర్‌లో పనుల జాతరలో పాల్గొన్నారు.
క్రీడాపోటీల్లో ఉత్సాహంగా పాల్గొనాలి
విద్యార్థులు క్రీడాపోటీల్లో ఉత్సాహంగా పాల్గొనా లని కలెక్టర్ సూచించారు. పోతుగల్‌లో ఎస్‌జీఎఫ్ క్రీడలను ప్రారంభించారు. విద్యార్థులకు షూస్ అందించాలని సూచించారు.
పీఎంకేఎస్‌వై ప్రతిపాదనలు అందించాలి
ప్రధానమంత్రి కృషి సించాయే యోజన 3.0 ప్రతిపాదనలు మూడు రోజుల్లో అందించాలని కలెక్టర్ కోరారు. కలెక్టరేట్‌లో శుక్రవారం పీఎంకేఎస్‌వైపై సమీక్షించారు. జిల్లాలోని 260 జీపీల పరిధిలో క్లస్టర్ వాటర్‌షెడ్ నిర్మాణానికి కేంద్రం నిర్ధేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేయాలన్నారు. డీఆర్‌డీవో శేషాద్రి, ఇన్‌చార్జి సీపీవో మల్లేశం, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, ఈఈ జానకీ, సుదర్శన్, జిల్లా హార్టికల్చర్ అధికారి లత, లేబర్ ఆఫీసర్ నజీర్ అహ్మద్, ముస్తాబాద్‌లో ఏఎంసీ చైర్‌పర్సన్ తలారి రాణి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, ఎంపీడీవో లచ్చాలు, ఏవో దుర్గరాజు, ఎంఈవో రాజిరెడ్డి, ఏపీఎం జయసుధ పాల్గొన్నారు.