
మహిళలు ఆర్థికంగా బలపడాలి
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతోందని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం కో రుట్లపేట, ఎల్లారెడ్డిపేట గ్రామాల్లో మహిళా సంఘాలు నిర్వహిస్తున్న పురుగుల మందు దుకా ణాలను శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో మహిళా సంఘాలు ధాన్యం కొనుగోళ్లను విజయవంతం చేశాయని అన్నారు. మ హిళలకు పెట్రోల్‌బంక్‌లను కూడా కేటాయించ డం జరుగుతుందని తెలిపారు. మహిళా సంఘాలు నడపగలిగే శక్తి ఉండే మండలానికి ఒకటి చొ ప్పున రైస్ మిల్లులను కేటాయిస్తామని అన్నారు.
గల్ఫ్ బాధితుడికి ఆర్థిక సాయం
ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటకు చెందిన మోకినిపల్లి నర్సవ్వ–నర్సయ్య దంపతులు గ్రామానికి వచ్చిన కలెక్టర్‌ను కలిసి తమ ఒక్కగానొక్క కొడుకు సుమన్ గల్ఫ్‌లో మరణించాడని మొరపెట్టుకున్నారు. స్పందించిన కలెక్టర్ వెంటనే తక్షణ సాయం కింద రూ.2లక్షలతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం, డీఆర్డీఏ శేషాద్రి, డీపీఎం వరుణ్‌రెడ్డి, ఎంపీడీవో సత్తయ్య, ఏపీఎం మల్లేశం, ఏఎంసీ చైర్మన్ సాబేర బేగం, వైస్‌చైర్మన్ రాంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
యూరియా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ముస్తాబాద్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన యూరియా కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. ముస్తాబాద్ మండలం ఆవునూర్‌లో ఏర్పాటు చేసిన యూరియా, ఎరువుల కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళా శక్తి ద్వారా అందరికీ ప్రయోజనాలు దక్కుతాయన్నారు. ఏఎంసీ చైర్‌పర్సన్ తలారి రాణి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాల్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి ఆఫ్జల్‌బేగం, మండల వ్యవసాయాధికారి దుర్గరాజు, ఏపీవో దేవరాజు తదితరులు పాల్గొన్నారు.