
సెస్‌లో సిటిజన్ చార్ట్ అమలు చేయాలి
● సంస్థను ఎన్‌పీడీసీఎల్‌లో విలీనం చేయాలి ● సీజీఆర్‌ఎఫ్ చైర్మన్‌కు వినతులు
సిరిసిల్లటౌన్: సహకార విద్యుత్ సరఫరా సంస్థ(సెస్)లో సిటిజన్ చార్టర్ అమలు చేయాలని సిరిసిల్ల పట్టణ వినియోగదారులు డిమాండ్ చేశారు. సిరిసిల్ల పద్మనాయక ఏసీ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వినియోగదారులు ప లు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి మాట్లాడారు. విద్యుత్ మీటర్ రీడింగ్స్‌లో పారదర్శకత లోపించిందని, అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెస్‌ను ఎన్‌పీడీసీఎల్‌లో విలీనం చేయాలని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్, ప్రతినిధులు చీకోటి అనీల్‌కుమార్ తదితరులు కోరారు. పలవురు వినియోగదారులు వేదికపైకి వచ్చి తమకు వచ్చిన అధిక కరెంటు బిల్లులు, తాము ఎదుర్కొంటున్న సంస్థాపరమైన సమస్యలను నేరుగా ఫిర్యాదు చేయగా అన్నింటినీ పరిష్కరిస్తామని వేదిక ప్రతినిధులు పేర్కొన్నారు.
సకాలంలో బిల్లులు చెల్లించాలి
సెస్ వినియోగదారులు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించి సంస్థ మనుగడకు సహకరించాలని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేది క చైర్మన్ ఎరికల నారాయణ అన్నారు. ఏ సమస్య ఉన్న అధికారులు వెంటనే స్పందిస్తారని తెలిపారు. మంచి లాభాల బాటలో పనిచేస్తున్న సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ వినియోగదారుడిపై అ న్నారు. విద్యుత్ వినియోదారుల సమస్యల పరి ష్కారవేదిక సభ్యులు రామకృష్ణ, మరిపల్లి రాజాగౌడ్, సెస్ ఎండీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.