
అమ్మకో మొక్క
● ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలి ● తహసీల్దార్ ముక్తార్ పాషా
వీర్నపల్లి(సిరిసిల్ల): సందర్భం ఏదైనా.. స్థలం ఎక్కడున్నా ప్రతి ఒక్కరూ అమ్మ కోసం ఒక మొక్కను నాటాలని తహసీల్దార్ ముక్తార్‌పాషా, చందుర్తి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మహమ్మద్ ఖలీలుద్దీన్ కోరారు. అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వనమహోత్సవంలో గురువారం వీర్నపల్లి, రంగంపేట, గర్జనపల్లి ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటాలి. విద్యార్థులు భవిష్యత్ తరాల సంక్షేమం కోసం విరివిగా మొక్కలు నాటాలని కోరారు. గర్జనపల్లి హెచ్‌ఎం వెంగళ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాములునాయక్, సెక్షన్ అధికారులు సక్కారామ్, రంజిత్‌కుమార్, పద్మలత, స్కూల్ డెవలప్‌మెంట్ కమిటీ చైర్మన్ రాకేశ్‌గౌడ్, ఉపాధ్యాయులు బలరాం, మంజుల, శ్రీనివాస్, కవిత పాల్గొన్నారు.
ఎకై ్సజ్ నేరాల నియంత్రణకు సహకరించాలి
● జిల్లా ఎకై ్సజ్ అధికారి శ్రీనివాస్‌రావు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలో ఎకై ్సజ్ నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని, యువత గంజాయి, గుడుంబాకు దూరంగా ఉండాలని జిల్లా ఎకై ్సజ్ అధికారి పి.శ్రీనివాస్‌రావు కోరారు. ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో వివిధ నేరాలలో పట్టుబడ్డ వాహనాలకు గురువారం బహిరంగ వేలం నిర్వహించారు. ఏడు వాహనాలను అధికారులు పట్టుకోగా, నాలుగు వాహనాలకు వేలం పాట నిర్వహించారు. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.1,19,652 ఆదాయం వచ్చింది. సీఐ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

అమ్మకో మొక్క