
బీఆర్‌ఎస్ డైవర్షన్ పాలిటిక్స్
● కాంగ్రెస్ ఇన్‌చార్జి మహేందర్‌రెడ్డి
సిరిసిల్లటౌన్: ప్రజా ఆదరణ లేదన్న అక్కసుతో బీఆర్‌ఎస్ నేతలు తమ ఉనికి కోసం డైవర్షన్ పాలి టిక్స్ చేస్తున్నారని సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి విమర్శించారు. సిరిసిల్లలోని తన నివాసంలో ఆదివారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించే నైతికత కేటీఆర్‌కు లేదన్నారు. ఆయనో పరాన్నజీవి అని.. తండ్రి చాటు బిడ్డగానే రాజకీయాల్లో ఉంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయం ప్రకాశంతో రాజకీయాల్లో రాణించి ప్రజాభీష్టంతో ముఖ్యమంత్రి అయ్యారన్నారు. 2023, 2024 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ప్రజలు బొందపెట్టార న్నారు. అప్పటి నుంచి కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలి పించాలని బతుకమ్మ చీరలకు సంబంధించి రూ.275కోట్లు బకాయి పెట్టి బెదిరింపులకు పాల్ప డి ఓట్లు వేయించుకున్నాడని కేటీఆర్‌పై ఆరోపణలు చేశారు. ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపరెడ్డి, ఆకునూరి బాలరాజు, మడుపు శ్రీదేవి, ఆడెపు చంద్రకళ, కాముని వనిత, వైద్య శివప్రసాద్, రాగుల జగ న్, గడ్డం నర్సయ్య, కత్తెర దేవదాసు పాల్గొన్నారు.
క్రీడలపై ఆసక్తి చూపాలి
వేములవాడఅర్బన్: ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తి చూపాలని జిల్లా అధ్యక్షుడు సంఘస్వామి కోరారు. వేములవాడ మండలం అగ్రహారం ఓ ఫంక్షన్‌హాల్‌లో జిల్లా మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ సమావేశం ఆదివారం నిర్వహించారు. సంఘస్వామి మాట్లాడుతూ 30 నుంచి 80 ఏళ్లలోపు మహిళలు, పురుషులు వెటరన్ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందన్నరు. నవంబర్ 5 నుంచి 9 వరకు చైన్నెలో జరిగే ఆసియన్ ఓపెన్ చాంపియన్‌షిఫ్ పోటీల్లో పాల్గొనాలన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతలపల్లి మునీందర్, ఉపాధ్యక్షుడు గడ్డం సత్యనారయణరెడ్డి, లక్ష్మణ్, అంజయ్య, శంకర్, పఠాన్, రాంచందర్, వినోద్, సిద్దు ఉన్నారు.

బీఆర్‌ఎస్ డైవర్షన్ పాలిటిక్స్