సర్పంచ్‌ల సేవలు మరువలేం | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ల సేవలు మరువలేం

Apr 6 2026 8:24 AM | Updated on Apr 6 2026 8:24 AM

మార్కాపురం రూరల్‌: గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌లు కృషి మరువలేమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా రాంబాబు అభినందించారు. పదవీ కాలం ముగిసిన సర్పంచ్‌ల అధినందన కార్యక్రమం ఆదివారం పట్టణంలోని జవహర్‌నగర్‌ కాలనీలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అన్నా రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వ సహకారం సరిగా లేకపోయినా పోరాడి సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధికి కృషి చేశారన్నారు. గత ఐదేళ్లుగా సర్పంచ్‌లు తమ సమయం, శ్రమ వెచ్చించి గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేశారన్నారు. మౌలిక వసతుల కల్పనలో కొన్ని ప్రాంతాల్లో అధికారుల నుంచి, ప్రతిపక్ష పార్టీ నాయకుల నుంచి ఇబ్బందులు, వివక్ష ఎదురైనా తమ గ్రామాల అభివృద్ధికి వెనుకడుగు వేయలేదన్నారు. పార్టీని నమ్మించి పని చేసిన ప్రతి కార్యకర్తకు తాను కష్టకాలంలో అండగా ఉంటానన్నారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశ్వాసంతో నిలబడిన వారదంరినీ ఆయన అభినందించారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ విజయానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. అధికారులు అందించే నూతన ఓటర్ల జాబితాలో ఓట్లు అన్ని ఉన్నాయో లేదో చూసుకోవాలన్నారు. అధికార పార్టీ బెదిరింపులకు భయపడకుండా వైఎస్సార్‌ సీపీని బలోపేతం చేసేందుకు ముందుకు సాగే వారిని పార్టీ గుర్తిస్తుందన్నారు. అనంతరం వివిధ గ్రామాల సర్పంచ్‌లను సన్మానించారు. కార్యక్రమంలో కుందురు చిన్న వెంకటరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ గొలమారి శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్షుడు పోరెడ్డి చెంచిరెడ్డి, ఎంపీపీ బండి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు దేవండ్ల పెద్ద మల్లయ్య, జెడ్పీటీసీ నారు బాపన్‌రెడ్డి, వాల్మీకి కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ నల్లబోతుల కొండయ్య, బట్టగిరి తిరుపతిరెడ్డి, భవనం వెంకట రామిరెడ్డి, మాలపాటి శ్రీనివాసరెడ్డి, కుందురు శ్రీనివాసరెడ్డి, ఎల్‌ శేఖర్‌, జాజ వెంకటేశ్వర్లు, ఏర్వ వెంకటేశ్వరరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు శ్రీరాములు, నాద గురుబ్రహ్మం, ఎంవీ రమణారెడ్డి, తుమ్మా రవణమ్మ, సింగపోగు తిరుమలమ్మ, బట్టగిరి గౌతమి, కుకట్లపల్లి పెద్ద శ్రీను, వేల్పుల వెంకట లక్ష్మి, దండా వెంకటేశ్వరెడ్డి, గోమసాని వెంకటేశ్వర్లు, గుంజా రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

కష్టకాలంలో అండగా ఉంటా

మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement