భక్తిశ్రద్ధలతో రంగనాయకస్వామి చక్రస్నానం | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో రంగనాయకస్వామి చక్రస్నానం

Apr 6 2026 8:24 AM | Updated on Apr 6 2026 8:24 AM

రాచర్ల: మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనామకస్వామి బ్రహ్మోత్సవాల ముంగిపు సందర్భంగా ఆదివారం స్వామికి చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. అర్చకులు అన్నవరం సత్యనారాయణచార్యులు, వెంకటరంగచార్యులు అధ్వర్యంలో నెమలిగుండ్లరంగనాయకస్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ప్రత్యేక పూలతో అలంకరించి పూజలు చేశారు. నీటి గుండం వద్ద ఏర్పాటు చేసిన స్వామి చక్రస్నానానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు చేశారు. చైర్మన్‌ సిద్ధం నరసింహులు, దేవస్థానం ఈఓ మల్లవరపు నాగయ్య, ఎంపీడీఓ ఎస్‌.వెంకటరామిరెడ్డి, కంభం, గిద్దలూరు అర్బన్‌, రూరల్‌ సీఐలు మల్లికార్జున్‌రావు, సురేష్‌, జె.రామకోటయ్య, రాచర్ల ఎస్సై పి.కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. భక్తులకు అన్నసత్రాల్లో అన్నదానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement