కనిగిరిరూరల్: మార్కాపురం బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు, క్షతగాత్రులకు ఆర్థికసాయం అందజేశారు. మృతులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున, క్షతగాత్రులకు రూ.20 వేల చొప్పున వైఎస్సార్ సీపీ కనిగిరి ఇన్‌చార్జి దద్దాల నారాయణ పార్టీ నేతలతో వెళ్లి అందజేశారు. కనిగిరి మండలంలోని లింగారెడ్డిపల్లి మండాదివారిపల్లికి చెందిన ఉప్పు రమాదేవి కుటుంబానికి రూ.లక్ష, చల్లగిరిగిల్ల పంచాయతీ తమ్మిశెట్టి పిచ్చమ్మ, మనుమరాలు తమ్మిశెట్టి రుక్మిణిల కుటుంబాలకు చెరొక రూ.లక్ష, పునుగోడు కు చెందిన దేవండ్ల రామయ్య కుటుంబానికి రూ.లక్ష అందజేశారు. క్షతగాత్రులైన మండాదివారిపల్లికి చెందిన డబ్బుకొట్టు శ్రీహరిని, కుటుంబ సభ్యులను పరామర్శించి వైద్య ఖర్చులకు రూ.20 వేలు అందజేశారు. పార్టీ మండల అధ్యక్షుడు, జెడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎస్‌కే అబ్దుల్ గఫార్, ఎస్ మోహన్‌రెడ్డి, గాండ్లపర్తి ఆదినారాయణరెడ్డి, మండాది కృష్ణారెడ్డి, వాకుమళ్ల రాజశేఖర్‌రెడ్డి, పోలక సిద్దారెడ్డి, లక్కిరెడ్డి తిరుపతిరెడ్డి, కుమ్మరికుంట రవి, సంగటి మహేంద్రారెడ్డి, శీలం శివారెడ్డి,చిలంకూరి బ్రహ్మరెడ్డి, కొండా మాలకొండారెడ్డి, మండాది వెంకట సుబ్బయ్య, సంగటి మాధవరెడ్డి, వేమన గురవారెడ్డి, మాలపాటి మాల్యాద్రి, కుమ్మరి వెంకటేశ్వర్లు, గాలిబోయిన నాగార్జున, రామచంద్రుని ఐజాక్, అల్లాటిపల్లి మహేష్, కాసుల బాలయ్య, బత్తుల మాలీ, మల్లెల వెలుగొండయ్య, అల్లాటిపల్లి కొండారెడ్డి, బాలయ్య, మాధవ్, నరేంద్ర, రాజాల ప్రసాద్, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.


