విద్యుదాఘాతానికి మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి మహిళ మృతి

Apr 6 2026 8:24 AM | Updated on Apr 6 2026 8:24 AM

విద్యుదాఘాతానికి మహిళ మృతి లారీ ఢీకొని గొర్రెలు మృతి

తాళ్లూరు: విద్యుదాఘాతానికి మహిళ మృతి చెందింది. ఈ ఘటన తాళ్లూరులో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే..తాళ్లూరుకు చెందిన ఇడమకంటి బలరామిరెడ్డి భార్య రమాదేవి(50) ఇనుమ కత్తితో కొబ్బరి కాయలు కొడుతుండగా పక్కనే ఉన్న ఇనుప రాడ్‌ను తగిలింది. ఆ రాడ్డు వెళ్లి విద్యుత్‌ తీగలను తాకటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది.

సంతమాగులూరు (అద్దంకి రూరల్‌): రోడ్డు దాటుతున్న గొర్రెలను లారీ ఢీకొట్టడం గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన సంతమాగులూరు మండలంలో ఆదివారం జరిగింది. గొర్రెల యజమాని కోనంకి శ్రీను తెలిపిన వివరాల మేరకు..మండలలోని మక్కెనవారిపాలెం గ్రామానికి చెందిన గొర్రెలకాపరి కోనంకి శ్రీను ఆదివారం గొర్రెల మందను తీసుకొని పొలానికి వెళ్లి మేపుకొని వస్తున్నాడు. ఈ క్రమంలో అద్దంకి–నార్కెట్‌పల్లి నామ్‌ రహదారిపై ఉన్న ఏల్చూరు– కొమ్మాలపాడు గ్రామాల మధ్య నున్న రహదారిపై గొర్రెల మందును అద్దంకి నుంచి పిడుగురాళ్ల వెళుతున్న లారీ ఢీకొట్టింది. మందలోని 4 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. 7 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. గొర్రెల కాపరి శ్రీను సంతమాగులూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సుమారు రూ.1.50 లక్షల వరకు నష్టం వాటిల్లిందని వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement