కనులపండువగా
సీతారాముల కల్యాణం
దర్శి:
శ్రీరామనవమి వేడుకలను నియోజకవర్గంలో కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో కల్యాణం కమనీయంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని తిలకించారు.
బూచేపల్లి ప్రత్యేక పూజలు
దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పట్టణంలో పలు రామాలయాల్లో పూజల్లో పాల్గొన్నారు. కొత్తపాలెం రామాలయంలో, పొదిలిరోడ్డు రామాలయం, కురిచేడురోడ్డు ఆంజనేయ స్వామి ఆలయం, కొత్తరెడ్డిపాలెం రామాలయాలలో సీతారాముల కళ్యాణ వేడుకలకు హాజరయ్యారు. స్వామి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కురిచేడు రోడ్డులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హాజరైన శివప్రసాద్‌రెడ్డి, వెంకాయమ్మలను దుశ్శాలువాలు, పూల మాలలతో ఘనంగా సత్కరించారు. వేద ఆశీర్వచనం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ముత్తినీడి సాంబయ్య, మాజీ నెడ్ కాప్ డైరెక్టర్ సానికొమ్ము తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, మాజీ ఎంపీటీసీ కర్ణా వెంకటరెడ్డి, యరమల మధు,శ్రీనివాసరెడ్డి, న్సిలర్‌లు మేడం మోహన్‌రెడ్డి, ఆవుల జ్యోతి శివారెడ్డి, నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ షకీలా అమీన్‌భాషా, అన్నవరపు వెంకట రవి, మేడగం బాల కృష్ణారెడ్డి, కేసరి ప్రసాద్‌రెడ్డి, రహమాన్, వెన్నపూస పేరిరెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు వేమి రెడ్డి చెన్నారెడ్డి, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, మేడం కోటిరెడ్డి, బొమ్మిరెడ్డి లక్ష్మీ రెడ్డి, గంజి వెంకటేశ్వరరెడ్డి, ఉడుముల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హాజరైన వైఎస్సార్ సీపీ
జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్
బూచేపల్లి వెంకాయమ్మ


