మహాశివరాత్రికి నారాయణస్వామి ఆలయ ఆదాయం రూ.29.18 లక్షలు | - | Sakshi
Sakshi News home page

మహాశివరాత్రికి నారాయణస్వామి ఆలయ ఆదాయం రూ.29.18 లక్షలు

Feb 17 2026 8:51 AM | Updated on Feb 17 2026 8:51 AM

మహాశివరాత్రికి నారాయణస్వామి ఆలయ ఆదాయం రూ.29.18 లక్షలు

మహాశివరాత్రికి నారాయణస్వామి ఆలయ ఆదాయం రూ.29.18 లక్షలు

సీఎస్‌పురం (పామూరు): ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి ఆలయానికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా రూ.29.18 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ శ్రీగిరిరాజు నరసింహబాబు, వ్యవస్థాపక ధర్మకర్త కొమ్మినేని చిన్న ఆదినారాయణ, చీఫ్‌ ఫెస్టివల్‌ ఆఫీసర్‌ బి.రమేష్‌ తెలిపారు. స్థానిక ఆలయ ప్రాంగణ భవనంలో సోమవారం చీఫ్‌ ఫెస్టివల్‌ ఆఫీసర్‌, ఆలయ ఈఓ, ధర్మకర్తల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హుండీల ద్వారా రూ.16,89,755, టికెట్ల అమ్మకం ద్వారా రూ.3,85,680, లడ్డు ప్రసాదం విక్రయం ద్వారా రూ.3,08,700, అన్నదానానికి విరాళంగా రూ.2,87,754, మహాప్రాకార నిర్మాణానికి విరాళంగా రూ.25,116, ఉభయదాతల విరాళాల కింద రూ.1,80,696, ఇతర విరాళాలు రూ.41,096, మొత్తం రూ.29,18,797 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement