మహాగని తోట దగ్ధం
● రూ.3 లక్షల ఆస్తి నష్టం
ముండ్లమూరు: మండలంలోని ఉమామహేశ్వర అగ్రహారం సమీపంలో మూడు ఎకరాల మహాగని తోట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే..చీరాలకు చెందిన సురేష్ గ్రామంలో 20 ఎకరాల మహాగని పంట సాగు చేశారు. ఈ క్రమంలో ఉమామహేశ్వరపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చిల్లచెట్టుకు నిప్పు పెట్టగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న మహాగని తోటకు అంటుకున్నాయి. దీంతో తమ పొలంలో వేసిన రెండున్నర ఎకరాల మహాగని పంట పూర్తిగా దగ్ధమైంది. పొలంలో వేసిన డిప్ వైర్లు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.3 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. కాపలాదారుడు ద్వారా విషయం తెలుసుకున్న యజమాని కాలిపోయిన తోటను చూసి కన్నీరు మున్నీరై విలపించాడు. దర్శి నుంచి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అదుపు చేసినా పంట నష్టం వాటిల్లింది.


