ఆది దంపతుల కల్యాణం.. చూసిన కనులదే భాగ్యం
కొత్తపట్నం: మహాశివరాత్రి సందర్భంగా కొత్తపట్నం మండలం మడనూరు శివాలయంలో మహాదేవుడి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. లింగోద్భవ పూజల అనంతరం సోమవారం వేకువజామున గంగ, పార్వతివర్థిని సమేత రామలింగేశ్వరస్వామి, గంగా భ్రమరాంబ సమేత కన్నేశ్వర స్వామి కల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ఈఓ సాంబశివరావు, గ్రామ పెద్దలు కల్యాణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సోమవారం రాత్రి నాలుగు దేవుళ్ల గ్రామోత్సవం నిర్వహించారు.
త్రిపురాంతకం: మహా శివారత్రి మహోత్సవాల్లో భాగంగా ప్రసిద్ధిగాంచిన త్రిపురాంతక క్షేత్రంలో పార్వతీదేవి, త్రిపురాంతకేశ్వస్వామి కల్యాణ ఘట్టం వేదపండితుల మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ రంగరంగ వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తజనులు ఆది దంపతుల కల్యాణాన్ని తిలకించి తరించారు. పెళ్లి పెద్దలుగా మార్కాపురం ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి దంపతులు, ఆలయ ఈఓ అనిల్‌కుమార్ దంపతులు వ్యవహరించారు. సామాజిక సత్రాల వారు, పలువురు ప్రముఖులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.
ఆది దంపతుల కల్యాణం.. చూసిన కనులదే భాగ్యం


