ఎస్‌హెచ్‌జీ మహిళల సర్వే నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్‌హెచ్‌జీ మహిళల సర్వే నిర్వహించాలి

Feb 14 2026 10:03 AM | Updated on Feb 14 2026 10:03 AM

ఎస్‌హెచ్‌జీ మహిళల సర్వే నిర్వహించాలి

ఎస్‌హెచ్‌జీ మహిళల సర్వే నిర్వహించాలి

● డీఆర్‌డీఏ పీడీ నారాయణ

ఒంగోలు వన్‌టౌన్‌: 2026–27 ఆర్ధిక సంవత్సర ప్రారంభంలోనే స్వయం సహాయక మహిళల సర్వే నిర్వహించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరక్టర్‌ టీ నారాయణ తెలిపారు. ఒంగోలు భాగ్యనగర్‌లోని టీటీడీ సెంటర్‌లో డీఆర్‌డీఏ వెలుగు ఆధ్వర్యంలో స్వయం సహాయక గ్రూపు సభ్యుల ఆదాయ వివరాల సర్వేపై శిక్షణ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ఇ–నారీ సీఆర్‌పీల ద్వారా సభ్యుల ఆదాయ, ఖర్చుల వివరాలను మొబైల్‌ యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. సంబంధిత కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు. కార్యక్రమంలో ఎంఎస్‌సీలు, ఎఫ్‌పీఓలు తదితర సిబ్బందికి శిక్షణ అందించారు. కార్యక్రమంలో లైవ్‌లీ హుడ్‌ పాం డీపీఎం డీ రజనీ కాంత్‌, లైవ్‌లీ హుడ్‌ నాన్‌ ఫాం డీపీఎం డీ దానం, సంస్థాగత నిర్మాణాల డీపీఎం లక్ష్మీ రెడ్డి, ఏపీఎం జే నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement