గోగినేనివారిపాలెంలో మహిళ హత్య
పొదిలి రూరల్: రాత్రి నిద్రకు ఉపక్రమించిన మహిళ తెల్లవారేసరికి శవమైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను గొంతు నులిమి, మెడకు తాడు బిగించి చంపినట్లు మృతదేహంపై ఆనవాళ్లు స్పష్టం చేస్తున్నాయి. పొదిలి మండలంలోని గోగినేనివారిపాలెం ఎస్సీ కాలనీలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. స్థానికుల కథనం మేరకు.. ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న పులి బుల్లెమ్మ(50) భర్త 5 నెలల క్రితం మృతి చెందాడు. గురువారం రాత్రి 10 గంటల వరకు ఆమె టీవీ చూసి నిద్రపోయింది. శుక్రవారం ఉదయం ఆమె మృతి చెందిందన్న విషయం తెలియడంతో కాలనీ మొత్తం కలకలం రేగింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బుల్లెమ్మ నివాసం ఉండే ఇంటితోపాటు పరిసర ప్రాంతాలను దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ రాజేష్‌కుమార్, ఎస్సై వేమన తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. క్లూస్‌టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతురాలి శరీరం, మెడపై నల్లగా కమిలి ఉండడంతో గొంతు నులిమి చంపినట్లు నిర్ధారణకు వచ్చారు. ఆమె హత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమార్తె లక్ష్మీతిరుపతమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో సమగ్ర దర్యాప్తునకు సంబంధించి జిల్లా పోలీసులకు ఏబీసీడీ అవార్డు దక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా కీలక కేసుల దర్యాప్తులో ప్రతిభ కనబరిచే పోలీసు అధికారులకు ప్రతి 3 నెలలకోసారి ఈ అవార్డు ప్రకటిస్తారు. శుక్రవారం మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరిష్ గుప్తా చేతుల మీదుగా జిల్లా ఎస్పీ హర్షవర్థన్‌రాజు, విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ అవార్డు అందుకున్నారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, మహిళా పోలీసు స్టేషన్ సీఐ సుధాకర్, ప్రస్తుత ట్రాఫిక్ సీఐ జగదీష్, డీటీసీ సీఐ పాండురంగారావు, గతంలో చీమకుర్తి సీఐగా విధులు నిర్విహించిన ఎం.సుబ్బారావు, సోషల్ మీడియా సెల్ సీఐ సూర్యనారాయణ, సంతనూతలపాడు ఎస్సై వి.అజయ్‌బాబు పాల్గొన్నారు.
ఏబీసీడీ స్ఫూర్తితో..
సంచలన కేసులను సమర్థవంతంగా పరిష్కరించినప్పుడే ప్రజల్లో పోలీసు శాఖపై గౌరవం పెరుగుతుందని ఎస్పీ హర్షవర్థన్‌రాజు చెప్పారు. ఈ అవార్డును స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్‌లో మరిన్ని కేసులను సమష్టిగా చేధించడానికి కృషి చేయాలని సూచించారు. జిల్లాకు అవార్డు దక్కడం గర్వకారణమన్నారు.
గోగినేనివారిపాలెంలో మహిళ హత్య
గోగినేనివారిపాలెంలో మహిళ హత్య


