ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతి
అర్ధవీడు: వెనుక వస్తున్న ఆర్టీసీ బస్సుకు సైడ్ ఇవ్వబోయి అదుపు తప్పిన ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతిచెందగా మరొకరికి గాయాలైన ఘటన మండలంలోని గన్నెపల్లి–రంగాపురం గ్రామాల మధ్య శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. బోరుబావిలో ఇరుక్కుపోయిన మోటార్లు వెలికితీసే ట్రాక్టరు గన్నెపల్లి నుంచి యాచవరం వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సుకు సైడ్ ఇవ్వబోయి అదుపు తప్పి పక్కనున్న సైడుకాలువలో పడిపోయింది. ట్రాక్టర్‌లో ఉన్న కడప జిల్లా మైదుకూరు మండలం రాబురాంపేటకు చెందిన ముత్యాల శ్రీను (44) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. ట్రాక్టర్‌లో ఉన్న ప్రొద్దుటూరు మండలానికి చెందిన ఆకుమల్ల కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


