అభివృద్ధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి
ఒంగోలు సబర్బన్: ఆకాంక్షిత మండలంలో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర ప్రభారి అధికారి వి.శ్రీనివాసరావు సూచించారు. కేంద్ర ప్రభుత్వం యాస్పిరేషనల్ బ్లాక్ కింద యర్రగొండపాలెం మండలంలో చేపట్టిన అభివృద్ధి పనుల పర్యవేక్షణకు నియమితులైన ప్రభారి అధికారి శ్రీనివాసరావు శుక్రవారం ఒంగోలులో కలెక్టర్ రాజాబాబుతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ విధివిధానాలపై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆకాంక్షిత మండలంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 39 అంశాల్లో కొన్ని నూరు శాతం సాధించారని, మిగిలిన అంశాలపై కూడా శ్రద్ధ చూపాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆకాంక్షిత మండలాల్లో నిర్దేశిత లక్ష్యాలను మూడు నెలల్లోగా పూర్తి స్థాయిలో చేరుకోవాలన్నారు. సమావేశంలో సీపీఓ సుధాకర్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్లు, డీఎస్‌ఓ పద్మశ్రీ, డీఆర్డీఏ పీడీ నారాయణ, పశుసంవర్ధక శాఖ జేడీ వెంకటేశ్వరరావు, మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, బీసీ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బాల శంకరరావు, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, ఐటీడీఏ, ఐసీడీఎస్, అటవీ, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఆకాంక్షిత మండలంలో పనులు చేపట్టాలి
కేంద్ర ప్రభారి అధికారి వి.శ్రీనివాసరావు


