అతివేగానికి యువకుడు బలి
టంగుటూరు: బైక్‌పై వేగంగా ప్రయాణిస్తున్న యువకుడు ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. టంగుటూరులోని ముదిరాజ్‌పాలేనికి చెందిన అనుముల అరుణ్ చంద్(19) వల్లూరు సమీపంలోని పేస్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం కాలేజీ వదిలిన తర్వాత మిత్రులతో కలిసి ఒంగోలు వెళ్లి అర్ధరాత్రి వేళ ఇంటికి తిరుగుపయనమయ్యాడు. అతివేగంగా వస్తున్న క్రమంలో రాత్రి సుమారు 11.55 గంటలకు టంగుటూరు టోల్ గేట్ సమీపంలో ముందు వెళ్తున్న కంటైనర్ లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అరుణ్ చంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని ఎస్సై నాగమల్లేశ్వరరావు పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. మృతుడి తండ్రి రమేష్‌బాబు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
పుల్లలచెరువు: బతుకుదెరువు కోసం వచ్చిన యువకుడిని విద్యుదాఘాతం రూపంలో మృత్యువు కబలించింది. ఈ సంఘటన పుల్లలచెరువు మండలంలోని ఐటీవరం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లాలోని రాజక్కపేట గ్రామానికి చెందిన కొరివి యాదగిరి(26) వరి కోత యంత్రం డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఐటీ వరం గ్రామానికి చెందిన ఊట్ల రామయ్య పొలంలో వరి పైరు కోస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో షాక్‌కు గురయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతప్‌కుమార్ తెలిపారు.
ప్రమాదంలో మృతి చెందిన అరుణ్ చంద్
అరుణ్ చంద్ (ఫైల్)
యాదగిరి(పైల్)
సంఘటన స్థలంలో యాదగిరి మృతదేహం
వెనుక నుంచి కంటైనర్‌ను ఢీకొట్టిన బైక్
టంగుటూరు టోల్‌గేట్ వద్ద ప్రమాదం
అతివేగానికి యువకుడు బలి
అతివేగానికి యువకుడు బలి
అతివేగానికి యువకుడు బలి


