కరాటేలో మార్కాపురం విద్యార్థిని సత్తా
మార్కాపురం: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో డాలీ కాలేజీలో ఈనెల 15న నిర్వహించిన స్కూల్ గేమ్స్ కరాటే పోటీల్లో మార్కాపురం పట్టణానికి చెందిన ఎమ్‌ఎస్ స్పోర్ట్స్ కరాటే స్కూల్ విద్యార్థిని ఎస్‌కే జోయా సిద్ధిఖి సత్తా చాటింది. అండర్–14 బాలికల విభాగంలో జాతీయ స్థాయిలో తృతీయ స్థానంలో నిలిచిన బాలికను కరాటే చీఫ్ ఎగ్జామినర్ ఎం శ్రీనివాసరెడ్డి, పలువురు పట్టణ ప్రముఖులు అభినందించారు.
ఒంగోలు సిటీ: బీహార్‌లో ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించిన అండర్–13 మెయిన్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఒంగోలుకు చెందిన దండు ఆశశ్రీ గరల్స్ సింగిల్స్ విభాగంలో కాంస్యం సాధించింది. కుమార్తె విజయంపై ఆశశ్రీ తండ్రి శ్రీనివాసరావు ఆనందం వ్యక్తం చేశారు. ఆశశ్రీ ప్రదర్శనపై ఆమెకు శిక్షణ ఇస్తున్న బెంగళూరులోని ప్రకాష్ పడుకోన్ బ్యాడ్మింటన్ అకాడమీ కోచ్ సాగర్ చోప్రా హర్షం వ్యక్తం చేశారు.
సింగరాయకొండ: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో గాయపడ్డ జార్ఖండ్ కూలీల్లో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన నలుగురు కూలీలు విద్యుత్ సామగ్రి ఉన్న ట్రాక్టర్‌లో శానంపూడి వెళ్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టరు కందుకూరు ఫ్లయ్‌ఓవర్ పక్కన సర్వీసు రోడ్డులోకి రాగానే ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొట్టి బోల్లా పడింది. ఈ ఘటనలో మట్టదొరై(25), చొక్రో గోపి(20)కి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరు యువకులకు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ ఒంగోలు జీజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మట్టదొరై, చొక్రోగోపి మృతి చెందారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించామని పోలీసులు వివరించారు.
కరాటేలో మార్కాపురం విద్యార్థిని సత్తా
కరాటేలో మార్కాపురం విద్యార్థిని సత్తా


