లైంగిక దాడి కేసులో నిందితునికి పదేళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

లైంగిక దాడి కేసులో నిందితునికి పదేళ్ల జైలు

Dec 12 2025 10:12 AM | Updated on Dec 12 2025 10:12 AM

లైంగి

లైంగిక దాడి కేసులో నిందితునికి పదేళ్ల జైలు

లైంగిక దాడి కేసులో నిందితునికి పదేళ్ల జైలు వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి రైలు ఢీకొని మహిళ మృతి జిల్లా విద్యాశాఖాధికారిగా రేణుక బాధ్యతల స్వీకరణ పాము కాటుకు మహిళ మృతి

ఒంగోలు: మతిస్థిమితం లేని మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితునికి పదేళ్ల జైలు శిక్ష విఽధిస్తూ 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి పందిరి లలిత గురువారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. మానసిక వికలాంగురాలైన బాధితురాలిది ఒంగోలు. 2021 మార్చి 20న సాయంత్రం 4 గంటల సమయంలో నాగినేని నారాయణ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై అప్పటి సీఐ సత్యకై లాష్‌ కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఇరువైపులా వాదనల అనంతరం నేరం రుజువైనట్లు పేర్కొంటూ నిందితుడు నారాయణకు పదేళ్ల జైలుశిక్ష, పదివేల రూపాయల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి పందిరి లలిత తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్‌ తరఫున అదనపు పీపీ కేవీ రామేశ్వరరెడ్డి, కోర్టు లైజన్‌గా ఏఎస్సై కె.లక్ష్మీనారాయణ, హెచ్‌సీ కె.నరేంద్రరావులు వ్యవహరించారు.

సింగరాయకొండ: వేటకు వెళ్లి మత్స్యకారుడు ప్రమాదశాత్తు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం మండలంలోని పాకల గ్రామ పంచాయతీ పోతయ్యగారి పట్టపుపాలెం వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..పోతయ్యగారి పట్టపుపాలెంకు చెందిన కోడూరి ఏడుకొండలు(47) గురువారం తెల్లవారుజామున తన ఇద్దరు కుమారులతో కలిసి చేపల వేటకు వెళ్లాడు. చేపల కోసం వల వేసి వల లాగే క్రమంలో ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మృతి చెందాడు. దీంతో ఇద్దరు కుమారులు తండ్రి ఏడుకొండలు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై బి. మహేంద్ర పేర్కొన్నారు.

సింగరాయకొండ: రైలు పట్టాలు దాటుతుండగా గూడ్స్‌రైలు ఢీకొని అంగన్‌వాడీ కార్యకర్త కరేటి రమాదేవి(62) మృతి చెందింది. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం సోమరాజుపల్లి రైల్వే గేటు సమీపంలోని 3వ రైల్వేలైనుపై జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..సోమరాజుపల్లి ఎస్సీ కాలనీ–2 లోని అంగన్‌వాడీ కేంద్రంలో రమాదేవి పనిచేస్తోంది. మధ్యాహ్నం ఆమె ఇంటికి వెళుతుండగా రైలు పట్టాలు దాటే క్రమంలో కావలి నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న గూడ్స్‌రైలు ఆమెను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రమాదేవి మృతికి ఆయాలు, కార్యకర్తలు, సూపర్‌వైజర్లు సంతాపం తెలియజేశారు. అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ రిజ్వానా, స్నేహితురాలు ఖమురున్నీసా సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

ఒంగోలు సిటీ: జిల్లా విద్యాశాఖాధికారిగా సీవీ రేణుక గురువారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు డీఈఓగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులకు వందరోజుల యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేస్తున్నట్లు తెలిపారు. పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత వచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అధికారులందరినీ సమన్వయం చేసుకుంటూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకుంటూ ముందుకు పోతామన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్‌ పి.రాజాబాబు, జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌ గోపాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు.

మర్రిపూడి: పాముకాటుకు మహిళ మృతి చెం

దింది. ఈ సంఘటన మండలంలోని కెల్లంపల్లి పంచాయతీ జి.అగ్రహారంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కెల్లంపల్లి పంచాయతీ జి.అగ్రహారం గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ మాజీ ఎంపీటీసీ కందిమళ్ల రామయ్య, అతన భార్య అరుణ(40) ఇద్దరు కలిసి పశువులకు గడ్డి కోసేందుకు గ్రామానికి సమీపంలోని పొలంలోకి వెళ్లారు. కోసిన గడ్డిని ట్రాక్టర్‌లో వేసే క్రమంలో గడ్డిలో ఉన్న పాము కాటు వేసింది. దీంతో బాధితురాలిని పొదిలి వైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమపిత్తం ఒంగోలులోని ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు.

లైంగిక దాడి కేసులో  నిందితునికి పదేళ్ల జైలు 1
1/1

లైంగిక దాడి కేసులో నిందితునికి పదేళ్ల జైలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement