కారు డ్రైవర్‌కు సంకెళ్లు
యర్రగొండపాలెం: టోల్‌గేట్‌ల వద్ద చలానా ఎగ్గొట్టేందుకు, పోలీసుల చెకింగ్ నుంచి బయటపడేందుకు కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్, పోలీస్ సైరన్‌తో తిరుగుతున్న డ్రైవర్‌ను స్థానిక పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కె.అజయ్‌కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. మార్కాపురానికి చెందిన షేక్ మున్వర్ అలియాస్ మున్నా ఐదేళ్ల క్రితం అప్పటి గిద్దలూరు ఎమ్మెల్యే కారు డ్రైవర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో గడువుదీరిన ఎమ్మెల్యే స్టిక్కర్‌ను నిందితుడు తన వద్ద ఉంచుకొని దానిపై వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు పేరుతో నకిలీ స్టిక్కర్ తయారు చేయించుకొని కారు ముందు భాగాన పెట్టుకొని తిరుగుతున్నాడు. గడువు తీరిన ఎమ్మెల్యే స్టిక్కర్‌తో టోల్‌గేట్, ఫారెస్ట్ చెక్క్ పోస్టుల వద్ద డబ్బులు చెల్లించకుండా దర్జాగా తన కారును తిప్పుతున్నాడు. ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, మార్కాపురం డీఎస్పీ నాగరాజు ఆదేశాల మేరకు ఎస్సై పి.చైడయ్య మాచర్ల రోడ్డులోని మిల్లంపల్లి టోల్ గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో అతని బాగోతం బయటపడింది. నకిలీ స్టిక్కర్‌తో పాటు కారు నంబర్ ఏపీ07డీజడ్1807లో ఉన్న డీని బ్లూ కలర్ స్టిక్కర్‌తో బ్లాక్ చేశాడు. నిందితుడు మున్వర్‌పై ట్యాంపరింగ్, ఎంవీ కేసులు నమోదు చేశామని సీఐ తెలిపారు. అర్హత లేని వారు తమ వాహనాలపై పోలీస్, ప్రెస్, మెజిస్ట్రేట్, ఎమ్మెల్యే, ప్రభుత్వ శాఖలకు చెందిన లోగోలు వాడుతున్నారని, అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ అజయ్‌కుమార్ హెచ్చరించారు.
● నూతన అధ్యక్షుడిగా శిద్దా సుధీర్‌కుమార్
ఎమ్మెల్యే నకిలీ స్టిక్కర్‌తో తిరుగుతున్న నిందితుడు
వివరాలు వెల్లడించిన సీఐ అజయ్‌కుమార్


