విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వద్దు
దర్శి: విద్యార్థులకు వసతులు కల్పించే విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆయన గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతుల గురించి ఆరా తీశారు. వంటగది, తాగునీరు, మరుగుదొడ్లను పరిశీలించారు. వసతి గృహంలో ఉన్న విద్యార్థులతో మాట్లాడి మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెలా వైద్యులు వస్తున్నారా లేదా, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు, హాస్టల్లో కల్పిస్తున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు బాలికల వసతి గృహాన్ని పరిశీలించినట్లు తెలిపారు. వసతులు, భోజనంపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీనాయక్, దర్శి నియాజకవర్గ ప్రత్యేకాధికారి జూన్సన్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావు, తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, ఏఎస్‌డబ్ల్యూఓ ఆదిలక్ష్మి, హాస్టల్ వార్డెన్ అరుణ పాల్గొన్నారు
బాలికల హాస్టల్‌ను తనిఖీ చేసిన
డీఆర్వో ఓబులేసు


