మెరుగైన ఫలితాలు సాధించాలి
కనిగిరిరూరల్: మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని ఇంటర్ విద్య గుంటూరు జోన్ సంయుక్త సంచాలకురాలు జె.పద్మ అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంకల్ప–2026 కార్యాచరణ ప్రణాళిక అమలు తీరును, బోధనాభ్యాసాన్ని, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఏబీసీ కేటగిరిలుగా వర్గీకరించి నిర్వహిస్తున్న పరీక్షల విధానం, ఫలితాల విశ్లేషణను సమీక్షించారు. మెరుగైన ఫలితాలు సాధించాలని తెలిపారు. అనంతరం రికార్డులను, సైన్స్ ల్యాబ్‌ను, మధ్యాహ్న భోజన పథకం, వసతులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పొలంరెడ్డి రమణారెడ్డి, అధ్యాపకులు కుమ్మరకుంట సురేష్, సీహెచ్ చెన్నకేశవులు, పద్మజ, రవీంద్ర, హనుమంతరావు, రామరాజు, కోటి సాహెబ్, వెంకటరాజు, గురవమ్మ, నాగమణి, ప్రమోద్, వెంకట సురేష్, మార్తమ్మ, మహాబూబ్ బాషా, సాయి తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌జేడీ పద్మ


