చెన్నారెడ్డిని కోర్టుకు తరలించిన పోలీసులు
సాక్షి టాస్క్‌ఫోర్స్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి నెమలిదిన్నె చెన్నారెడ్డిపై నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో గురువారం మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు విచారణ చేపట్టారు. సంఘటన జరిగిన హైవే రోడ్డులో ఉన్న టీస్టాల్‌ను పరిశీలించి వివరాలు సేకరించారు. చెన్నారెడ్డి గురువారం ఉదయం మార్కాపురం డీఎస్పీ కార్యాలయంలో హాజరయ్యాడు. మాజీ ఎమ్మెల్యేలు కేపీ నాగార్జునరెడ్డి, అన్నావెంకటరాంబాబు డీఎస్పీ కార్యాలయం వద్దకు వెళ్లి అధికారులు, వైఎస్సార్ సీపీ నాయకులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. రాత్రి 10 గంటల సమయంలో చెన్నారెడ్డిని మార్కాపురం డీఎస్పీ కార్యాలయం నుంచి కంభం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చి అక్కడ వైద్య పరీక్షల అనంతరం గిద్దలూరు కోర్టుకు తీసుకెళ్లారు. చెన్నారెడ్డి వైద్యశాలకు తీసుకొచ్చారని తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు అధిక సంఖ్యలో వైద్యశాలకు చేరుకొని సంఘీభావం తెలిపారు.
చెన్నారెడ్డిని కోర్టుకు తరలించిన పోలీసులు


