వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా షంషేర్ ఆలీబేగ్
మార్కాపురం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా మార్కాపురం పట్టణానికి చెందిన డాక్టర్ మీర్జా షంషేర్ ఆలీబేగ్‌ను నియమిస్తూ తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. ఈయన గతంలో ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా, మార్కాపురం మార్కెట్ యార్డు చైర్మన్‌గా పనిచేశారు. తనపై నమ్మకంతో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని, కార్యకర్తలకు అందుబాటులో ఉండి పార్టీ అభివృద్ధికి కృషిచేస్తానని షంషేర్ తెలిపారు. తనకు పదవి వచ్చేందుకు సహకరించిన వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి శివశంకర్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.


