హుస్సేన్‌బీ ఇంటిని పరిశీలించిన తహసీల్దార్
పొన్నలూరు: మండలంలోని కె.అగ్రహారంలో ఎస్‌కే హుస్సేన్‌బీ సర్వే నంబర్ 447/3ఏలోని 78 గజాల స్థలంలో సుమారుగా 40 ఏళ్ల క్రితం ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటుంది. హుస్సేన్‌బీకి ముగ్గురు కుమార్తెలు కాగా మూడో కుమార్తె తన తల్లి ఇంటిని దక్కించుకునేందుకు స్థానిక టీడీపీ సానుభూతిపరుడి సహకారంతో స్థానిక వీఆర్వో సంతకం, స్టాంపును ఫోర్జరీ చేసి తన పేరుపై పొజిషన్ సర్టిఫికెట్ తయారు చేశారు. ఈ తరువాత కుమార్తె ఫోర్జరీ పత్రంతో తన భర్తకి గత అక్టోబర్‌లో రిజిస్ట్రేషన్ చేసింది. విషయం తెలుసుకున్న హుస్సేన్‌బీ ఆధారాలతో కలెక్టర్‌కు స్పందనలో ఫిర్యాదు చేసింది. దీనిపై అధికారులు పట్టించుకోకపోవడంతో హుస్సేన్‌బీ సమస్యపై సాక్షిలో మంగళవారం శ్రీఅక్రమాల కేటుగాళ్లుశ్రీ అనే శీర్షికన ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఉన్నతాధికారులు ఈ విషయంపై విచారించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. దీంతో బుధవారం తహసీల్దార్ పుల్లారావు గ్రామానికి చేరుకొని బాధితురాలితో మాట్లాడారు. అనంతరం సచివాలయానికి చేరుకొని హుస్సేన్‌బీతో పాటు కుమార్తెని విచారించారు. ఇద్దరికీ నోటీసులు జారీ చేస్తామని, నాలుగు రోజుల్లో అర్హత పత్రాలు చూపించాలని, లేకుంటే అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
హుస్సేన్‌బీ ఇంటిని పరిశీలించిన తహసీల్దార్


