ఉరేసుకొని దివ్యాంగుడు ఆత్మహత్య
బేస్తవారిపేట: మండలంలోని చింతలపాలెం ఎస్సీకాలనీలో ఉరేసుకొని మూగ వ్యక్తి పెద్ద మూగయ్య(35) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి సమయంలో జరిగింది. అర్థవీడు మండలం వెలగలపాయకు చెందిన పెద్ద మూగయ్య కొన్నేళ్లుగా చింతలపాలెంలోని వాటర్‌ప్లాంట్‌లో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య దానమ్మ పిల్లలతో కలిసి ఎస్సీకాలనీలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యపై అనుమానంతో అప్పుడప్పుడు గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం స్వగ్రామం వెలగలపాయకు వెళ్లాడు. వాటర్‌ప్లాంట్ నిర్వాహకుడు నచ్చజెప్పడంతో నెల రోజుల క్రితం భార్య వద్దకు వచ్చాడు. అయినా భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంటి పక్కన ఉన్న పూరిపాకలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఎస్సై రవీంద్రారెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


