సత్వర పరిష్కారం చూపాలి
ఒంగోలు సిటీ:
ప్రజల నుంచి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులపై త్వరితగతిన విచారణ చేపట్టి సత్వర పరిష్కారం చూపాలని ఎస్పీ వి.హర్షవర్థన్‌రాజు పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్థన్‌రాజు, పోలీస్ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వారి సమస్యలను లిఖితపూర్వకంగా ఎస్పీకి, పోలీస్ అధికారులకు విన్నవించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకుని వాటిని చట్టపరంగా త్వరితగతిన పరిష్కరిస్తామని ఎస్పీ, పోలీస్ అధికారులు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిర్యాదులపై తక్షణ విచారణ చేపట్టి చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుని భాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.
అలసత్వం వహించకుండా నిర్ణీత గడువులోగా ఫిర్యాదులు పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చే వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్నవారి సమస్యలు విని వారికి సత్వర న్యాయం చేయాలని చెప్పారు. కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వి.వి.రమణకుమార్, పీసీఆర్ ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్, సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, దర్శి సీఐ వై.రామారావు, మార్కాపురం సీఐ సుబ్బారావు, కొండపి సీఐ సోమశేఖర్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని...
పోలీస్ గ్రీవెన్స్‌లో ఎస్పీ హర్షవర్థన్‌రాజు
మొత్తం 119 ఫిర్యాదులు


