కోటి సంతకాలు వేగవంతం చేయండి
● మాజీ మంత్రి, సంతనూతలపాడు ఇన్‌చార్జి మేరుగు నాగార్జున
చీమకుర్తి రూరల్: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున అన్నారు. మండలంలోని కూనంనేనివారిపాలెంలో పార్టీ మండల అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు మండలంలోని 24 పంచాయతీల్లో 10 వేలకు పైగా సంతకాలు సేకరించారని, ఇంకా మిగిలి ఉన్న గ్రామాల్లో కూడా సంతకాల సేకరణ చేసి ఆ పత్రులను 9వ తేదీ లోగా అందజేయాలని కోరారు. ఇప్పటి వరకు సంతనూతలపాడు నియోజకవర్గంలో 60 వేలకు పైగా సంతకాల సేకరణ చేశారని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారన్నారు. కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, జిల్లా రైతు విభాగం ప్రధానకార్యదర్శి గంగిరెడ్డి ఓబులరెడ్డి, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు బొడ్డు కోటేశ్వరావు, మండల ఉపాధ్యధ్యాక్షుడు చీదర్ల శేషు, వసంతరావు, మోహన్ కల్లూరి నారాయణ, వేమా గోవింద్, హరీష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


