వైద్య విద్యను నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు | - | Sakshi
Sakshi News home page

వైద్య విద్యను నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు

Dec 8 2025 7:44 AM | Updated on Dec 8 2025 7:44 AM

వైద్య విద్యను నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు

వైద్య విద్యను నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు

పీపీపీ పేరుతో కార్పొరేటర్లకు దోచిపెట్టేందుకే వైద్య విద్య ప్రైవేటీకరణ వైఎస్సార్‌సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ పొన్నలూరులో కోటి సంతకాల పత్రాలను అందజేసిన వైఎస్సార్‌ సీపీ శ్రేణులు

పొన్నలూరు: ప్రభుత్వ వైద్య విద్యను పేద ప్రజలకు అందకుండా ప్రైవేటీకరణ పేరుతో సీఎం చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ అన్నారు. కూటమి ప్రభుత్వం కుట్రలో భాగంగా ప్రభుత్వ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పొన్నలూరులో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ఏర్పాటు చేస్తే నేడు సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైద్య విద్యను పీపీపీ పేరుతో తన అనుచరులకు, కార్పొరేటర్లకు దోచిపెడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్‌ కళాశాలలను మంజూరు చేయించి వాటిలో 7 మెడికల్‌ కళాశాలలను పూర్తి చేసి పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించారన్నారు. ఆ తరువాత ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న పనులకు నిధులు కేటాయించి పనులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. ప్రభుత్వం రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే అసంపూర్తిగా ఉన్న మెడికల్‌ కళాశాలలు వాడుకలోకి వస్తాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమం పట్టడం లేదని, కేవలం కల్తీ మద్యం తయారీ, అక్రమ ఇసుక, మట్టి రవాణా, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై దాడులు, అక్రమ కేసులు పెడుతున్నారు తప్పా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్తులు, వ్యవస్థలను ప్రైవేట్‌ పరం చేస్తూ ప్రజల సంపదను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. సీఎం చంద్రబాబు కార్పొరేట్‌ విధానం వలన రాష్ట్ర అభివృద్ధి మరో 70 ఏళ్లు వెనుక్కుపోయిందన్నారు. చంద్రబాబు సర్కార్‌ ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ ప్రభుత్వ తప్పులను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. పచ్చ మీడియాను అడ్డుపెట్టుకొని చేయని పనులను కూడా చేసినట్లుగా చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుతో రాష్ట్రంలో ప్రజా ఉద్యమం ప్రారంభమైందని, రాబోవు రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తప్పక బుద్ధి చెబుతారన్నారు. ప్రభుత్వ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పొన్నలూరు మండలంలో 12 వేలు, కొండపి నియోజకవర్గంలో 70 వేలకు పైగా ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారన్నారు. వీటిని ఈ నెల 10న జిల్లా కేంద్రానికి చేర్చుతామని, 17న మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో రాష్ట్ర గవర్నర్‌కి అందజేస్తామన్నారు. ఈ రెండు కార్యక్రమాల్లో ప్రజలు, వైఎస్సార్‌ సీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, పొన్నలూరు, మర్రిపూడి మండల కన్వీనర్లు దుద్దుగుంట మల్లికార్జునరెడ్డి, ఇంకొల్లు సుబ్బారెడ్డి, పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, గడ్డం మాల్యాద్రి, అనుమోలు ప్రసాద్‌, గొల్లపూడి రవణయ్య అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement