బహుజన ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడిగా అంజయ్య
ఒంగోలు టౌన్: బహుజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా తేళ్ల అంజయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక హైదరి క్లబ్‌లో మిడసల నాగార్జున అధ్యక్షతన జిల్లా ప్రభుత్వ, ప్రైవేటురంగ ఉద్యోగుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఉపాధ్యక్షులుగా నక్కా కాంతారావు, జి.అవినాష్, ప్రధాన కార్యదర్శిగా మిడసల నాగార్జున, సహాయ కార్యదర్శిగా జె.నారాయణ రావు, జాయింట్ సెక్రటరిగా ఎం.తిరుపాలు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కె.వీరాంజనేయులు, కోశాధికారిగా ఎస్.లలిత కుమారి ఎంపికయ్యారు. గౌరవాధ్యక్షుడిగా ఎస్.జాన్సన్, గౌరవ సలహాదారుడిగా ఎం.కిరణ్ కుమార్ ఎన్నికయ్యారు. సమావేశంలో విధి నిర్వాహణలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న వేధింపులు, అన్నీ శాఖలలో ఆర్‌ఓఆర్‌ను సక్రమంగా అమలు చేయకపోవడం, ఉద్యోగుల నియామకాల్లో ఫోకల్ ప్రింట్ ఆర్డర్స్‌ను అమలు చేయకపోవడం గురించి సమగ్రంగా చర్చించినట్లు మిడలస నాగార్జున తెలిపారు.
ఒంగోలు: రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు జిల్లా నుంచి ఏడుగురు ఎంపికయ్యారు. స్థానిక ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఆవరణలో ఆదివారం జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ నిర్వహించిన సీనియర్ బాక్సింగ్ పోటీల్లో జిల్లావ్యాప్తంగా పలువురు క్రీడాకారులు పాల్గొని తమ సత్తాచాటారు. వీరిలో ప్రతిభ కనబరిచిన కె.వంశీకృష్ణ, ఎస్‌కె ఆసిఫ్, జస్వంత్, గణేష్, రామస్వామి, ఏడుకొండలును ఎంపిక చేసినట్లు బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి లెమ్యూల్ రాజు, జవహర్ నవోదయ ఒంగోలు విద్యాలయ వ్యాయామ ఉపాధ్యాయులు కిషోర్‌లు తెలిపారు. ఎంపికై న ఈ క్రీడాకారులు ఈనెల 13, 14 తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని వారు పేర్కొన్నారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఆయన ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే కాదు...పోనీ ఎంపీపీ కాదు..చివరికి గ్రామ సర్పంచ్ కూడా కాదు. అధికార పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న నాయకుడు. యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి గుడూరి ఎరిక్షన్ బాబు పుట్టిన రోజు వేడుకలు ఆదివారం యర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో అట్టహాసంగా జరిగాయి. నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య జరిగిన ఈ పుట్టిన రోజు వేడుకల్లో యర్రగొండపాలెం సీఐ అజయ్ కుమార్ బొకేతో ప్రత్యక్షం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన సర్కిల్ పరిధిలోని వైపాలెం ఎస్సై చౌడయ్య, దోర్నాల ఎసై మహేష్, పుల్లల చెరువు ఎస్సై సంపత్ కుమార్‌లతో పసుపు పచ్చరంగు బొకేతో రంగ ప్రవేశం చేసిన సీఐ అజయ్ కుమార్ టీడీపీ నాయకుడికి కేక్ కట్ చేసి తినిపించారు. తానొక సీఐ అనే స్పృహ లేకుండా సామాన్య కార్యకర్తలాగా ఎరిక్షన్ బాబు పట్ల అత్యంత వినయంగా వ్యవహరించడం చూసిన పచ్చ తమ్ముళ్లు సైతం విస్మయానికి గురయ్యారు. నిబంధనలను గాలికి ఒదిలేసిన సీఐ పచ్చపార్టీ నాయకుడికి గులాంగిరి చేస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
ఒంగోలు టౌన్: ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో వరుస సంఖ్య 10లో గూటం జగదీష్‌తో పాటుగా ఏపీ ఫార్మా జేఏసీ ప్యానెల్‌ని గెలిపించాల్సిందిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. 16 ఏళ్ల తరువాత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికలు కేవలం ఫార్మాసిస్టుల భవిష్యత్తును నిర్ణయించేవే కాకుండా మందుల మాఫియాకు ముకుతాడు వేసే ఎన్నికలుగా అభివర్ణించారు.
బహుజన ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడిగా అంజయ్య
బహుజన ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడిగా అంజయ్య


