ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాటం
చీమకుర్తి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగే వరకు వైఎస్సార్ సీపీ చేస్తున్న పోరాటం ఆగదని పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. చీమకుర్తిలో గురువారం రాత్రి నిర్వహించిన కోటి సంతకాల సేకరణలో బూచేపల్లి శివప్రసాదరెడ్డితో పాటు జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకయమ్మ, మాజీ మంత్రి మేరుగు నాగార్జున ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాదరెడ్డి, మేరుగు నాగార్జున మాట్లాడుతూ పేద విద్యార్థులకు వైద్య విద్యను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒకేసారి 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించారన్నారు. వాటిని చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టేందుకు పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ జపం చేస్తున్నాడని మండిపడ్డారు. పీపీపీ విధానం వల్ల పేదలకు ఎంతో అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతున్నా చంద్రబాబు సర్కార్‌లో ఎలాంటి చలనం లేకపోవడం శోచనీయమన్నారు. అనంతరం కోటిసంతకాల సేకరణ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ గోపురపు రాజ్యలక్ష్మి, కౌన్సిలర్‌లు సోమా శేషాద్రి, బీమన వెంకట్రావు, మేకల సులోచన యల్లయ్య, చల్లా అంకులు, ఎన్.మాణిక్యం, పాటిబండ్ల గంగయ్య, తప్పెట బాబూరావు, ఆముదాలపల్లి ప్రమీల రామబ్రహ్మం, పత్తి కోటేశ్వరరావు, తెల్లమేకల గాంధీ, చిన్నపురెడ్డి మస్తాన్‌రెడ్డి, గోపురపు చంద్ర, మొగిలిశెట్టి వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
పేదలకు వైద్య విద్యను దూరం చేసేందుకే ప్రైవేటీకరణ
చీమకుర్తిలో కోటిసంతకాల సేకరణలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి, జెడ్పీ చైర్‌పర్సన్ వెంకాయమ్మ, మాజీ మంత్రి మేరుగు నాగార్జున


