ఎస్బీ డీఎస్పీగా చిరంజీవి
ఒంగోలు టౌన్: స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా టీ చిరంజీవి బాధ్యతలు చేపట్టారు. డీజీపీ కార్యాలయం నుంచి సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన ఇక్కడకు వచ్చారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో రిపోర్టు చేశారు.
ఒంగోలు సబర్బన్: ఓటర్ల జాబితా ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తయిందని కలెక్టర్ పీ.రాజా బాబు చెప్పారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్ ) మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంపై గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు వచ్చిన పురోగతిని సమీక్షించారు. జిల్లాలోని పరిస్థితిని కలెక్టర్ రాజాబాబు వివరించారు. ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తయిందని వాటిని సిస్టంలో ఆన్‌లైన్ చేయాల్సి ఉందన్నారు. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియను కూడా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసును కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మాధురి, జాన్సన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఒంగోలు సబర్బన్: వికసిత గ్రామీణ భారత్ దిశగా మహిళలే ముందు ఉండాలని కలెక్టర్ పీ.రాజాబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక ఆయన ఛాంబర్‌లో గురువారం నయీ చేతన్ జెండర్ కాంపెయిన్ పోస్టర్‌ను కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 23 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక సహకారులుగా మహిళల పాత్ర, సమానత్వం, సమాన అవకాశాలు, భద్రత, పని పంచుకుందాం తదితర అంశాలపై నాలుగు వారాలు మండలం, గ్రామం, గ్రూప్ స్థాయి వరకు సీ్త్ర, పురుషులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. మహిళలు ఆర్థికంగా స్వాతంత్రంగా వారి కుటుంబం, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలన్నారు. డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టరు టి.నారాయణ మాట్లాడుతూ ‘నయీ చేతన’ జెండర్ ప్రచారంలో భాగంగా మహిళా ఆర్థికాభివృద్ధి స్వేచ్ఛగా సంచరించగలిగే వాతావరణం కల్పించడం మహిళల స్వచ్ఛ, సమానత్వం గృహ పనులు పంచుకొనే సంస్కృతి ఏర్పాటు చేయటం, రుణాలు, మార్కెట్లు, సాంకేతిక మౌలిక సదుపాయలకు మహిళలకు ప్రాధాన్యత పెంచటం తదితర కార్యక్రమాలపై అవగాహన కల్పించాల్సి ఉందన్నారు.
ఎస్బీ డీఎస్పీగా చిరంజీవి
ఎస్బీ డీఎస్పీగా చిరంజీవి


