నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి | - | Sakshi
Sakshi News home page

నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి

Nov 28 2025 7:20 AM | Updated on Nov 28 2025 7:20 AM

నూరుశ

నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి

నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి అధ్యాపకుడిపై డిప్యూటీ డీఈఓ విచారణ విద్యుదాఘాతానికి మత్స్యకారుడు మృతి గంజాయి విక్రేతల అరెస్టు విద్యుత్‌ ఉద్యోగి ఆత్మహత్య

సమగ్రశిక్ష అడిషనల్‌ ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌ అనీల్‌కుమార్‌

ఒంగోలు సిటీ: కేజీబీవీ విద్యార్థినులంతా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌ అనీల్‌కుమార్‌ దాసరి అన్నారు. జిల్లాలోని 28 కేజీబీవీల ప్రిన్సిపాళ్లతో ఒంగోలులోని తన ఛాంబర్‌లో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనీల్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలోని కేజీబీవీల్లో 1077 మంది విద్యార్థినులు పదో తరగతి చదువుతున్నారని తెలిపారు. గత ఏడాది కేజీబీవీల్లో పదో తరగతికి సంబంధించి మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. 100 శాతం ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. పదో తరగతి విద్యార్థినులకు వంద రోజుల ప్రణాళికను కచ్చితంగా అమలు చేయాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు.

నాగులుప్పలపాడు: మండలంలోని బి.నిడమానూరు జూనియర్‌ కళాశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అధ్యాపకుడి తీరుపై గురువారం డిప్యూటీ డీఈఓ చంద్రమౌళేశ్వరరావు విచారణ చేపట్టారు. కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుడు బక్కమంతుల వినయ్‌ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. దీంతో గ్రామస్తులు కళాశాలకు చేరుకొని అధ్యాపకుడిని ప్రశ్నించారు. అతని నుంచి సరైన సమాధానం రాకపోవడంతో గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో గురువారం డిప్యూటీ డీఈఓ కళాశాలలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదరు అధ్యాపకుడిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు.

సింగరాయకొండ: విద్యుదాఘాతానికి మత్స్యకారుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని పాకల పంచాయతీ చెల్లెమ్మగారి పట్టపుపాలెం వద్ద గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మత్స్యకారుడు కాలంగారి జాలయ్య(39) ఇంటి సమీపంలో విద్యుత్‌ కండక్టర్‌ తెగి పడటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. జాలయ్య మృతితో పాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.మహేంద్ర తెలిపారు. చేస్తున్నట్లు ఎస్సై బి మహేంద్ర వివరించారు.

ఒకటిన్నర కిలోల గంజాయి స్వాధీనం

పెద్దదోర్నాల: గంజాయిని విక్రయించేందుకు శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ( సుండిపెంట)కు వెళుతున్న ముగ్గురు యువకులను యర్రగొండపాలెం సీఐ అజయ్‌కుమార్‌, ఎస్సై మహేష్‌ వలపన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన మండల పరిధిలో శ్రీశైలం రహదారిలోని బోడేనాయక్‌ వద్ద గురువారం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో పి. శ్రీను, లాలాశ్రీను, సురేస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మండలానికి చెందిన పి.శ్రీను, లాలాశ్రీను, సురేస్‌లు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. దీంతో డబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధితో గంజాయి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో తెలిసిన ఓ వ్యక్తి సహాయంతో అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలీ నుంచి గంజాయిని తెచ్చి మండల పరిసర ప్రాంతంలో విక్రయించేవారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు వీరి కోసం వెతుకుతున్న సమయంలో ఒకటిన్నర కిలోల గంజాయిని శ్రీశైలం వెళ్లే సాధువులకు విక్రయించేందుకు సుండిపెంటకు వెళుతున్నట్లు సమాచారం అందింది. సమాచామందుకున్న ఎస్సై మహేష్‌ బోడేనాయక్‌ తాండా వద్దకు వెళ్లారు. అక్కడే ఉన్న నిందితులు పోలీసులను చూసి పరిగెత్తగా అదుపులోనికి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు సీఐ, ఎస్సై తెలిపారు.

కంభం: మండలంలోని జంగంగుంట్ల గ్రామానికి చెందిన గొంగటి శ్రీను (45) కుటుంబ కలహాలతో గురువారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించిన హుటాహుటిన కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని చెప్పారు. నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు రావిపాడులో విద్యుత్‌ షిఫ్ట్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి
1
1/1

నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement