కార్తీక వెలుగులు
8లో..
– చిత్రమాలిక
కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కొత్తపట్నం, పాకల, మడనూరు సముద్ర తీరాల్లో వేకువజామునే భక్తులుసముద్ర స్నానాలు ఆచరించారు. తీరంలో సైకత శివలింగాలను తయారు చేసి అర్చించారు. దీంతో సముద్ర తీర ప్రాంతాలన్నీ భక్తజనసంద్రాలయ్యాయి. శైవక్షేత్రాలైన త్రిపురాంతకం, భైరవకోన, జమ్ములపాలెంతో పాటు ఒంగోలు నగరంలోని శివాలయాల్లో భక్తులు స్వామివారిని దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగించారు. పలుచోట్ల జ్వాలాతోరణాలు వెలిగించి హారతులిచ్చారు. ఏకాదశ రుద్రాభిషేకాలు చేశారు.
కార్తీక వెలుగులు


