● ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య
ఒంగోలు సిటీ: విపత్తు సెలవులు భర్తీ చేయనవసరం లేదని డీఈఓ కిరణ్‌కుమార్ కు తెలియజేసినట్లు ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నాయకులు తెలిపారు. రాష్ట్ర విద్యా శాఖ విద్యాశాఖ ప్రస్తుత విద్యా సంవత్సరానికి నిర్దేశించిన 220 పని దినాల సంఖ్య సరిపోయినందున విపత్తు సెలవులను భర్తీ చేయాల్సిన అవసరం లేదని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ప్రకాశం జిల్లా శాఖ బుధవారం డీఈఓ కిరణ్‌కుమార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రకాశం జిల్లా ఫ్యాప్టో నాయకులు డీఈఓ కిరణ్‌కుమార్‌తో పలు సమస్యల గురించి చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి అక్టోబర్ 2025 వరకు 95 పని దినాలు పూర్తయ్యాయని, మరో 130 పని దినాలు పాఠశాలలు జరుగుతాయని, విపత్తు సెలవులను భర్తీ చేయాల్సిన అవసరం లేదని డీఈఓకు తెలియజేసినట్లు చెప్పారు. ఓహెచ్ విషయంలో సింగిల్ టీచర్స్ పని చేసే చోట ఎంఈఓతో వారి సమస్య పరిష్కరిస్తామని డీఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో ప్రకాశం జిల్లా శాఖ బాధ్యులు ఓ.అబ్దుల్ హై, ఈ.శ్రీనివాసులు, చల్లాశ్రీను, సుబ్బారావు, హనుమంతరావు, ఓ.ఖాదర్ బాషా, వెంకటరావు, యు.సుబ్బయ్య, ఎ.సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.
చీమకుర్తి రూరల్: మండలంలోని బండ్లమూడి గ్రామంలో ఈనెల 3వ తేదీ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, వైఎస్సార్ సీపీ సానుభూతిపరులైన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిపై దాడి చేసిన నేపథ్యంలో ఈ ఘటనకు కారణమైన పాడైన సరుగుడు పొలాన్ని నష్టపరిహారం కోసం ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, ఎంఆర్‌ఓ బ్రహ్మయ్య బుధవారం పరిశీలించారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులైన ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారిపై దాడి చేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశం అయిన నేపథ్యంలో కలెక్టర్ స్పందించి బాధితులకు వెంటనే తగు న్యాయం చేయాలని ఆర్‌డీఓ లక్ష్మీప్రసన్నకు ఆదేశాలివ్వడంతో ఆమె తహసీల్దార్ బ్రహ్మయ్యతో కలిసి సరుగుడు పొలాన్ని పరిశీలించారు. పైరు ఎంత మేర నష్టం జరిగిందో నష్టపరిహారం అంచనా వేయాలని వ్యవసాయాశాఖాధికారిని ఆదేశించారు. ముందుగా ఎస్సీ కాలనీని సందర్శించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
విపత్తు సెలవులు భర్తీ చేయనవసరం లేదు


