జడిపించిన వాన
మోంథా తుఫాన్ ప్రభావంతో వర్షం దంచికొట్టింది. జిల్లాలో వాగువంకలు పొంగిపొర్లాయి. గ్రామీణ రహదారులతోపాటు రాష్ట్రీయ, జాతీయ రహదారులు సైతం వరద నీటితో పోటెత్తాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెరువులతోపాటు జలాశయాలు నిండుకుండలా మారాయి. పలు ప్రాంతాల్లో చెరువులకు గండ్లు పడటంతో వరద నీరు పంట పొలాలను ముంచెత్తింది.
– సాక్షి నెట్‌వర్క్
పులిపాడు వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు
గ్రానైట్ క్వారీలలో నిలిచిన వర్షం నీరు


