
కూటమి విధానాలపై ఉపాధ్యాయుల నిరసన
ఒంగోలు సిటీ: విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేలా కూటమి ప్రభుత్వం చేపడుతున్న విధానాలను నిరసిస్తూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశం భవనం ఎదుట నిరసన చేపట్టారు. ఏపీటీఎఫ్ జోన్ కన్వీనర్ బీ శేషారావు అధ్యక్షతన నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి డీ శ్రీనివాసులు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న 4 డీఏలు వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, 12వ పీఆర్సీ కమిటీ వేయాలని కోరారు. సీపీఎస్ రద్దు చేసి, అన్ని రకాల బకాయిలు చెల్లించాలన్నారు. ఈహెచ్‌ఎస్ బకాయిలు రూ.25 లక్షలకు పెంచాలన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పారు. నేడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రకాశం భవనం ఎదుట నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. కార్యక్రమంలో జిల్లా సబ్‌కమిటీ సభ్యులు శేఖరరెడ్డి, బషీరున్నీసా, అనిత, మండల శాఖ బాధ్యులు వీరరాఘవులు, మస్తాన్, మధు, మౌలాలి, టి.ఈశ్వరయ్య, రామారావు, సుబ్బయ్య, సుబ్బారావు, రామిరెడ్డి, శ్రీనివాసరావు, హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.