
ఎస్‌జీఎఫ్ జిల్లా క్రీడాకారుల ఎంపిక
ఒంగోలు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14, 17 ఆర్చరీ జిల్లా జట్ల ఎంపిక సోమవారం స్థానిక ఏబీయం జూనియర్ కాలేజీ ఆవరణలో నిర్వహించారు. ఎంపిక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏబీఎం జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ వాణి పాల్గొని క్రీడాకారులకు పలు సూచనలు చేశారు. అనంతరం క్రీడాకారులు విలువిద్య ప్రతిభ చాటుకున్నారు. కార్యక్రమంంలో ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి చక్కా వెంకటేశ్వర్లు, ఎంపిక కమిటీ జాతీయ న్యాయనిర్ణేత మేడికొండ జయలక్ష్మి, రావూరి మెర్సీ, ఆర్చరీ కోచ్ బత్తుల రాంబాబు, ఆర్చరీ జిల్లా కార్యదర్శి లెమ్యూల్ రాజు పాల్గొని పర్యవేక్షించారు

ఎస్‌జీఎఫ్ జిల్లా క్రీడాకారుల ఎంపిక