
నెట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక
దొనకొండ (కురిచేడు): స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రకాశం జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) అండర్ 14, అండర్ 17 బాల బాలికల నెట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక నిర్వహించారు. ఈ సెలక్షన్స్‌కు జిల్లా స్థాయిలో వివిధ పాఠశాలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి అండర్ 14 లో బాలురు 12 మంది, బాలికలు 12 మంది, అండర్ 17 లో బాలురు 12 మంది, బాలికలు 12 మందిని ఎంపిక చేశారు. ఈ ఎంపికను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీవీ రామాంజనేయులు అధ్యక్షతన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బీ మురళి నిర్వహించారు. ఎంపికై న క్రీడాకారులు ప్రకాశం జిల్లా తరఫున రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారని తెలిపారు.