
రైతు సంక్షేమాన్ని మరచిన కూటమి ప్రభుత్వం
సంతనూతలపాడు(చీమకుర్తి రూరల్): కూటమి ప్రభుత్వంలో రైతు ముఖంలో ఆనంధం కరువైందని, అభివృద్ధి సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం వదిలేసిందని వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగ నాగార్జున విమర్శించారు. సోమవారం చండ్రపాలెం, తక్కెళ్లపాడు, వేములపాడు గ్రామాల్లో బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. రైతుల ముఖంలో ఆనందం చూడాలంటే వైఎస్సార్‌సీపీతోనే సాధ్యం అవుతుందన్నారు. రైతన్నకు యూరియా అందించడంలో కూటమి ప్రభుత్వం విపలమైందని, వైఎస్సార్ సీపీ పోరాటాలతోనే రైతులకు కొంత మేరైనా ధరలు, ఒకటీ అరా పథకాలైనా అమలు చేస్తున్నారన్నారు. ఎన్నికల ముందు ముసలి కన్నీరు కార్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నుపోటు పొడవటం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రశ్నిస్తే అరెస్టులు అసత్య ప్రచారాలు, కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడంపై మండిపడ్డారు. కూటమి దౌర్జన్యాలకు, అరాచకాలకు ఫల్‌స్టాప్ పెట్టాలంటే రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగనన్నను సీఎంగా గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అనంతరం చండ్రపాలెం గ్రామ అధ్యక్షునిగా మనపాటి కిషోర్‌ని నియమించారు. కార్యక్రమంలో ఎంపీపీ బి.విజయ నాగేశ్వరావు, దుంపా యలమందరెడ్డి, సర్పంచ్‌లు దర్శిగమణి, మైనం శైలజ అమరనాఽథ్, ఎంపీటీసీ నల్లూరి రాధ భాస్కరరావు, మాదాల వెంకటరావు, ఎం.వెంకటరెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు ఇన్‌చార్జి మేరుగ నాగార్జున ధ్వజం
చండ్రపాలెం, తక్కెళ్లపాడు, వేములపాడు గ్రామాల్లో ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’