
మొక్కుబడిగా మీ కోసం!
● పోలీస్ సిబ్బంది అతి, కొందరు ఉన్నతాధికారుల దురుసు వైఖరిపై అర్జీదారుల అసంతృప్తి
ఒంగోలు సబర్బన్: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన మీ కోసం(పీజీఆర్‌ఎస్) కార్యక్రమం మొక్కుబడిగా సాగింది. కలెక్టర్ పి.రాజాబాబుకు సమస్యలు చెప్పుకొనేందుకు అర్జీదారులు భారీగా తరలివచ్చారు. అనివార్య కారణాలతో కలెక్టర్ మీ కోసంలో పాల్గొనకపోవడంతో జేసీ ఆర్.గోపాలకృష్ణ, డీఆర్ ఓ ఓబులేసు, డిప్యూటీ కలెక్టర్లు మాత్రమే అర్జీలు స్వీక రించారు. కలెక్టరేట్ పరిపాలనాధికారి రవికుమార్ అర్జీదారులను పట్టించుకోకుండా కాలు మీద కాలువేసుకొని కూర్చోవడంతో అర్జీదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మీ కోసం కాన్ఫరెన్స్ హాల్‌కు వెళ్లే సమ యంలో పోలీసులు చెకింగ్ పేరుతో ఇబ్బంది పెట్ట టం, తమదైన భాషలో మాట్లాడటంతో అర్జీదారులు నొచ్చుకున్నారు. వేదికపై కూర్చున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఇద్దరు.. ప్రజలతో అమర్యాదగా మాట్లాడ టం, డీఆర్‌ఓ ఓబులేసు సైతం ఓ దశలో ఆగ్రహానికి గురై ‘అర్జీలు ఇక్కడికెందుకు తేవడడం కోర్టులకు పోండి’ అనడంతో గందరగోళం నెలకొంది. మొత్తం మీద కార్యక్రమాన్ని తూతూమంత్రంగా ముగించారు.

మొక్కుబడిగా మీ కోసం!