
పట్టపగలే చైన్ స్నాచింగ్
● 3 సవర్ల బంగారం చోరీ
సింగరాయకొండ: పట్టపగలు ఇద్దరు ఆగంతకులు బైక్‌పై వచ్చి ఓ వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు లాక్కుని ఉడాయించారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం సింగరాయకొండ మండలంలోని మూలగుంటపాడులోని గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం పెరల్ డిస్టిలరీ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న రాయి బ్రహ్మయ్య తల్లి యానాదమ్మ మూలగుంటపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటి వద్ద నుంచి తాను నివాసముంటున్న విద్యానగర్‌లో అపార్టుమెంట్ వద్దకు వెళ్తున్నారు. అదే సమయంలో బైక్‌పై వేగంగా వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలోని సుమారు రూ.3 లక్షల విలువైన 3 సవర్ల బంగారు చైన్ లాక్కుని పరారయ్యారు. సంఘటనా స్థలాన్ని సీఐ హజరత్తయ్య, ఎస్సై మహేంద్ర పరిశీలించారు. నిందితులు పంచాయతీ ఆఫీసు రోడ్డు గుండా ఆర్టీసీ బస్టాండ్ వైపు వెళ్లి అక్కడ నుంచి మెయిన్‌రోడ్డు మీదుగా ఒంగోలు వైపు వెళ్లినట్లు సీసీ ఫుటేజ్‌లో పోలీసులు గుర్తించారు.