
మూర్తిమత్వమై..
పట్నం నుంచి పల్లె వరకూ అంతటా మహానేతకు నివాళులు జిల్లాకు రాజన్న చేసిన సేవలు స్మరించుకున్న అభిమానులు, ప్రజలు జిల్లా వ్యాప్తంగా అన్నదానాలు, సేవా కార్యక్రమాలు
ఇడుపులపాయలో
వైఎస్సార్‌కు తాటిపర్తి నివాళి
మది మదిలో
ఒంగోలు టౌన్:
గుండె గుండెలో చెరిగిపోని జ్ఞాపకాలైం.. అభిమానం పూలమాలలై.. పట్టణాల నుంచి పల్లెల దాకా ప్రతి ఊరు రాజన్న జ్ఞాపకాలతో పరవశించింది. మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా కృతజ్ఞతలు, కన్నీళ్లతో తడిసిన పూలదండలై రాజన్న విగ్రహాలను హత్తుకున్నాయి. ప్రజా సంక్షేమానికి, ప్రగతి ప్రస్థానానికి వేసిన పునాదులు ఆ దివ్య తేజోమూర్తి పాలన నేటికీ జనం గుండెల్లో ప్రతిధ్వనిస్తోంది. ఆయన పాలనా దక్షత స్ఫూర్తి తరతరాలకు అజరామరంగా చిరస్మరణీయంగా నిలిచిపోయింది. జిల్లా కేంద్రమైన ఒంగోలు నుంచి మారుమూల పుల్లల చెరువు మండలం వరకు ప్రతి పట్టణంలోను, గ్రామంలోనూ రాజన్నకు ఘనంగా నివాళలర్పించారు. బరువెక్కిన గుండెలతో.. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సామాన్య ప్రజలు రాజన్న చేసిన సంక్షేమ పాలనను మననం చేసుకొన్నారు. తమ భవిష్యత్ కోసం పునాదులేసిన ప్రజానేత ప్రవేశ పెట్టిన పథకాలను నేటికీ అమలవుతున్న తీరును స్మరించుకున్నారు.
పార్టీ జిల్లా కార్యాలయంలో..
నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు తదితరులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణా రెడ్డి, వై.వెంకటేశ్వర్లు, బొట్ల రామారావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజేష్, రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి ముల్లంగి రవీంద్రా రెడ్డి, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, నగర అధ్యక్షుడు కఠారి శంకర్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రవణమ్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే నగరంలోని పలు డివిజన్లలో పేదలు, మానసిక వికలాగులకు పండ్లు పంపిణీ చేశారు. అన్నదానాలు చేపట్టారు. చర్చి సెంటర్‌లో ఉన్న వెస్లీ విగ్రహానికి పార్టీ నాయకులు నివాళులర్పించారు.
దర్శి నియోజకవర్గంలో...
దర్శి నియోజకవర్గంలో జరిగిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలసి పాల్గొన్నారు. రాజన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని వైఎస్సార్ సెంటర్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొత్తరెడ్డి పాలెం, తూర్పు వీరాయపాలెం గ్రామాల్లో మహానేత రాజన్న విగ్రహాలకు పూలమాలలు వేశారు. నియోజకవర్గంలోని అన్నీ మండలాల్లోనూ వైఎస్సార్ వర్ధంతి నిర్వహించారు.
కొండపి నియోజకవర్గంలో...
కొండపి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి , మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సింగరాయకొండలోని పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మూలగుంటపాడు పంచాయతీలోని ఐటీఐ కాలేజీలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడ నుంచి కందుకూరు సెంటర్, బాలయోగి నగర్ సెంటర్లలోని వైఎస్సార్ విగ్రహాలకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, అభిమానులు ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొన్నారు. జరుగుమల్లి, పొన్నలూరులో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యాక్రమాలను ఆయన ప్రారంభించారు. అలాగే కొండపి, మర్రిపూడి, టంగుటూరు మండలాల్లో కూడా పార్టీ శ్రేణులు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.
మార్కాపురం నియోజకవర్గంలో..
మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో మార్కాపురం నియోజకవర్గంలో పొదిలి, తర్లుపాడు, కొనకనమిట్ల మండల కేంద్రాలతో పాటుగా అన్నీ గ్రామాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మార్కాపురం పట్టణంలోని పాత బస్టాండు సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి, తూర్పు వీధుల్లో వైఎస్సార్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షంషేర్ అలీ బేగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ సభ్యుడు వెన్నా హనుమారెడ్డితో పాటు పలువురు జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. తర్లుపాడులో పేదలకు పండ్లు పంపిణీ చేశారు. కొనకనమిట్లలో జరిగిన రక్తదాన శిబిరాన్ని అన్నా రాంబాబు ప్రారంభించారు. అనంతరం అన్నదానం చేశారు.
గిద్దలూరు నియోజకవర్గంలో...
గిద్దలూరు నియోజకవర్గంలో గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, బేస్తవారిపేట, కంభం, అర్ధవీడు మండలాల్లో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి కుందురు నాగార్జున రెడ్డి అర్ధవీడు మండలంలోని నాగులవరం గ్రామంలో జరిగిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీగా ఏర్పాటు చేసిన అన్నదానం చేశారు. రాచర్ల మండలంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
కనిగిరి నియోజకవర్గంలో...
కనిగిరి నియోజకవర్గంలోని అన్నీ మండలాల్లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి దద్దాల నారాయణ యాదవ్ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కనిగిరి పట్టణంలోని చెక్‌పోస్టు సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు రొట్టెలు, పండ్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో పీడీసీసీ మాజీ చైర్మన్ వైఎం ప్రసాద రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎస్‌కే అబ్దుల్ గఫార్, జెడ్పీటీసీ మడతల కస్తూరి రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ సరిత ప్రసాద్ రెడ్డి, చింతంగుంట్ల సాల్మన్ రాజ్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పల్లి శాంతి గోవర్ధన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి టి.సుజాత రెడ్డి పాల్గొన్నారు.
యర్రగొండపాలెంలో..
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా యర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పుల్లలచెరువులో వైఎస్సార్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. పెద్దదోర్నాల ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. పెద్దారవీడులో పేదలకు అల్పాహారం సమకూర్చారు. యర్రగొండపాలెంలో వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి సెంటర్‌లో ఉన్న మహానేత వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు.
సంతనూతలపాడు నియోజకవర్గంలో..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ మేరుగు నాగార్జున ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చీమకుర్తిలోని బూచేపల్లి కళ్యాణ మండపం, పోలీస్‌స్టేషన్ వద్ద ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహాలకు నివాళులర్పించారు. మద్దిపాడు మండలం వెల్లంపల్లిలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అన్నదానం చేశారు. పలువురు యువకులు రక్తదానం చేశారు. సంతనూతలపాడు, చీమకుర్తి మండలం ఇలపావులూరు, నాగులుప్పలపాడుల్లో నిర్వహించిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లోనూ మేరుగు నాగార్జున పాల్గొని వైఎస్సార్‌కు ఘన నివాళులర్పించారు.
జరుగుమల్లిలో అన్నదానం చేస్తున్న మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్
దర్శిలో అన్నదానం చేస్తున్న ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ
ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్‌లో నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా మంగళవారం ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్‌లో ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఘనంగా నివాళులర్పించారు. ఆయన వెంట ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు దొండేటి నాగేశ్వరరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పర్తి ఓబులరెడ్డి, ఆర్య వైశ్య సంఘం నాయకులు పబ్బిశెట్టి శ్రీనివాసులు, దోగిపర్తి సంతోష్‌కుమార్, యువజన విభాగం నాయకుడు ఆళ్ల కృష్ణారెడ్డి ఉన్నారు.

మూర్తిమత్వమై..

మూర్తిమత్వమై..

మూర్తిమత్వమై..

మూర్తిమత్వమై..

మూర్తిమత్వమై..