పోటాపోటీగా లడ్డుల వేలం పాటలు | - | Sakshi
Sakshi News home page

పోటాపోటీగా లడ్డుల వేలం పాటలు

Sep 3 2025 4:25 AM | Updated on Sep 3 2025 4:25 AM

పోటాప

పోటాపోటీగా లడ్డుల వేలం పాటలు

పోటాపోటీగా లడ్డుల వేలం పాటలు నక్కల గిరిజనులకు పక్కా గృహాలు నిర్మించాలి పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకల్లో అపశ్రుతి

రూ.1.56 లక్షలు పలికిన గణేష్‌ లడ్డు

చీమకుర్తి: వినాయక నిమజ్జనం సందర్భంగా పలు వినాయకుడి విగ్రహాల వద్ద లడ్డు వేలం పాటలు పోటాపోటీగా జరుగుతున్నాయి. పద్మశాలీయుల ఆధ్వర్యంలో చీమకుర్తిలోని శ్రీభావనారుషి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద లడ్డును అనుముల చలపతి రూ.1.56 లక్షలకు పాడుకున్నారు. స్వామి వారి వద్ద పూజలు అందుకున్న 25 కేజీల లడ్డును పాడుకున్న అనంతరం బంధువులతో కలిసి ఊరేగింపుగా ఇంటికి ఉత్సాహంగా తీసుకెళ్లారు. చీమకుర్తిలోనే రెడ్డిబజార్‌లో ఏర్పాటు చేసిన వినాయుడి ఊరేగింపులో ఏఎంసీ మాజీ చైర్మన్‌ మారం వెంకారెడ్డి పాల్గొన్నాడు. రెడ్డిబజారులో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డును బీమనాథం శేషిరెడ్డి, సుబ్బారెడ్డి కలిసి రూ.1.12 లక్షలకు పాడుకున్నారు.

ఒంగోలు వన్‌టౌన్‌: నక్కల గిరిజనులకు పక్కా గృహాలను నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద నక్కల గిరిజనుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి నక్కల గిరిజన సంఘం అధ్యక్షుడు ఆర్‌ రాణెమ్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న గిరిజన ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పేరం సత్యం మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు అయినా నక్కల వారికి కనీస మౌలిక వసతులను పాలకులు కల్పించలేదన్నారు. దీంతో వారు రోడ్లమీదనే జీవనం కొనసాగిస్తున్నారన్నారు. గతంలో నగరంలోని నక్కల వారికి అల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ముంపు ప్రాంతంలో 55 కుటుంబాలకు నివేశన స్థలాలు ఇచ్చారన్నారు. వారు ఏర్పాటు చేసుకున్న నిర్మాణాలు ముంపునకు కొట్టుకుపోయారన్నారు. దీంతో వారు తిరిగి రోడ్లమీదనే నివసిస్తున్నారన్నారు. కార్యక్రమానికి ఓపీడీఆర్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఆల్‌ఇండియా బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరణి కోట లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి టి.వెంకటస్వామి, రచయిత పిన్నిక శ్రీనివాస్‌, గిరిజన నాయకులు జెమిని, రాజు, రవి తదితరులు పాల్గొన్నారు. సీఐ, తహసీల్దార్‌ ఇచ్చిన హామీతో ధర్నా విరమించారు.

స్పృహ కోల్పోయిన గర్భిణి

పీసీపల్లి: డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో గర్భిణి స్పృహ కోల్పోయిన ఘటన పీసీపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పీసీపల్లి మండలం మల్లేనివారిపల్లికి చెందిన బత్తుల లక్ష్మీ తిరుపతమ్మ 8వ నెల గర్భిణి కావడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చూపించుకునేందుకు వచ్చింది. ఆ సమయంలో పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా జనసేన అభిమానులు వైద్యశాలలో రోగులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి వచ్చారు. ఆయనకు స్వాగతం పలికేందుకు, ఎమ్మెల్యే మెప్పు పొందేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది అంతా రోగుల గురించి పట్టించుకోకుండా ఎమ్మెల్యే చుట్టూ చేరారు. రోగులు కూర్చునేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఆ సమయంలో గర్భిణి లక్ష్మీ తిరుపతమ్మ కళ్లు తిరిగి స్పృహ తప్పి కింద పడిపోయింది. అప్పటికి గానీ వైద్య సిబ్బందిలో చలనం రాలేదు. గర్భిణిని తీసుకెళ్లి సైలెన్‌ పెట్టి చికిత్స అందించారు. దీనిపై స్థానిక డాక్టర్‌ యశ్వితను వివరణ కోరగా తిరుపతమ్మ ఆరో నెల గర్భిణి అని, అంతమందిని చూసి భయపడి కళ్లు తిరిగి పడిపోయిందని చెప్పారు. తిరుపతమ్మ భర్త బత్తుల బాబు మాట్లాడుతూ తన భార్య 8వ నెల గర్భిణి అని, అది కూడా వైద్యులకు తెలియలేదని, ప్రభుత్వాస్పత్రిలో అసలు రోగుల గురించి పట్టించుకోవడం లేదని అన్నారు. వచ్చిన రోగులు కూర్చునేందుకు కూడా అవకాశం లేకపోవడంతో బీపీ డౌన్‌ అయి కిందపడిపోయిందని చెప్పాడు.

పోటాపోటీగా లడ్డుల వేలం పాటలు 
1
1/2

పోటాపోటీగా లడ్డుల వేలం పాటలు

పోటాపోటీగా లడ్డుల వేలం పాటలు 
2
2/2

పోటాపోటీగా లడ్డుల వేలం పాటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement