
గణేష్ లడ్డు రూ.1.23 లక్షలు
దర్శి: పట్టణంలోని గాంధీనగర్ రామాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపం వద్ద నిమజ్జన ఊరేగింపు సందర్భంగా గణేష్ లడ్డు వేలం పాట పెట్టారు. వేలం పాటలో ముల్లంగి, దుగ్గిరెడ్డి బ్రదర్స్ కలసి రూ.1.23 లక్షలకు పాటపాడి ఈ లడ్డును దక్కించుకున్నారు.
ఒంగోలు టౌన్: సంక్షేమ సారథి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలు జిల్లా అంతటా నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మంగళవారం ఉదయం ఒంగోలు జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తామని బూచేపల్లి తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ వెంకాయమ్మ, పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులందరూ హాజరవుతారన్నారు. చీమకుర్తిలో మాజీ మంత్రి మేరుగు నాగార్జునతో కలిసి, దర్శిలో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.
నగరంలోని అన్ని ప్రాంతాల్లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు చేపడుతున్నామని పార్టీ నగర అధ్యక్షుడు కఠారి శంకర్ తెలిపారు. కార్యక్రమాల్లో ఒంగోలు అసెంబ్లీ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు హాజరవుతారన్నారు.